• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VIZIANAGARAM MAHARAJA COLLEGE CONTROVERSY TDP SERIOUS ALLEGATIONS ON SANCHAITA GAJAPATHI RAJU AND YS JAGAN MOHAN REDDY BA

Vizianagaram Maharaja College: సంచయిత సంచలన నిర్ణయం, టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు

Vizianagaram Maharaja College: సంచయిత సంచలన నిర్ణయం, టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు

విజయనగరం మహారాజా కళాశాల (Image; Facebook)

విజయనగరం పూసపాటి రాజవంశీయులు 1879లో నెలకొల్పిన విజయనగరం మహారాజా కళాశాలను ప్రైవేటుపరం చేసేందుకు మన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచయిత గజపతిరాజు ప్రయత్నాలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

  • Share this:
    Ashok Gajapathi Raju: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం మహారాజా కళాశాల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కాలేజీని ప్రైవవేటీకరించడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. ‘పంచభూతాలను దోచుకోవడం జగన్ నైజం. పాదయాత్ర సమయంలోనే జగన్ కన్ను మన్సాస్ ట్రస్టుపై పడింది. మన్సాస్ ట్రస్టును భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 తెరవెనుక పావులు కదుపుతున్నారు. విజయనగరం మహారాజా కళాశాలను అన్ ఎయిడెడ్ చేయాలనే ప్రయత్నాలను ఖండిస్తున్నాం. మహారాజా అలక్ నారాయణ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సొసైటీ అన్ ఎయిడెడ్ చేసేందుకు అశోక్ గజపతి రాజు కుటుంబం దరఖాస్తు చేసిందన్నది అవాస్తవం. రూ.120 కోట్ల డిపాజిట్లు, వేల ఎకరాల భూములతో స్వయంపోషకంగా ట్రస్టును తీర్చిదిద్దిన విజయనగరం రాజా పీవీజీ రాజు ఆశయాలకు తూట్లు పొడవడం బాధాకరం. దాతల ఆశయాలను కాలరాసే నైతిక హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తి మీద కక్షతోనో, ఒక పార్టీ మీద అక్కసుతోనో లక్షలాది పేద కుటుంబాల సంక్షేమానికి దోహదపడే సంస్థలను నిర్వీర్యం చేయడం దుర్మార్గం’ అంటూ కళా వెంకట్రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు.

    అశోక్ గజపతి రాజు తండ్రి నెలకొల్పిన ట్రస్టును ఆయన కళ్లముందే నాశనం చేయడం ద్వారా ఆయన్ను మానసికంగా కుంగదీసే కుట్ర జరుగుతోందని కళా వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ లాభాల కోసం, వ్యక్తిగత కక్ష సాధింపు కోసం మహాదాతల ఆశయాలకు గండి కొట్టడం పాలకుల ధర్మం కాదన్నారు. మన్సాస్ ట్రస్టులో ప్రభుత్వ అనవసర జోక్యానికి స్వస్తి పలకాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

    విజయనగరం మహారాజా కళాశాల


    విజయనగరం రాజ వంశం పూసపాటి వంశీయులు నెలకొల్పిన మన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత సంచయిత గజపతిరాజు (Sanchita Gajapathi Raju) పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. ఏకంగా పూసపాటి వంశీయులకు చెందిన దశాబ్దాల నాటి మహారాజా కళాశాలను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం, దానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి పంపారనే వార్తలు పెను సంచలనం రేపుతున్నాయి.

    సంచయిత గజపతిరాజు (Image:Facebook)


    పూసపాటి రాజవంశీయులు 1879లో విజయనగరంలో మహారాజా ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు డిమాండ్‌ పెరగడంతో ఇంటర్‌, డిగ్రీ కోర్సులను కూడా ప్రారంభించారు. దశాబ్దాలుగా ఎందరికో ఉన్నత విద్యాభ్యాసం అందించిన ఈ కళాశాలలో చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్ధానాలకు చేరుకున్నారు. విదేశాలకు వెళ్లారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ ఉన్నత విద్యాసంస్ధను తర్వాత కేవలం కళాశాలకే పరిమితం చేశారు. స్కూలును మరో ప్రాంగణంలోకి తరలించి ప్రైవేటు పరం చేసేశారు. అప్పటి నుంచి ఇది కాలేజీగానే కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇందులో 26 మంది అన్‌ ఎయిడెడ్‌, 100 అన్‌ ఎయిడెడ్‌ అధ్యాపకులు ఉన్నారు. 35 మంది బోధనేతర సిబ్బంది కూడా ఉన్నారు. 4 వేల మంది విద్యార్ధులు ఇక్కడ చదువుతున్నారు. యూజీసీ నిధులతోనే ఈ కాలేజీ ఇప్పటికీ నడుస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు