Vizag Steel Plant: హస్తినను తాకుతున్న స్టీల్ ఉద్యమం.. లోక్ సభలో పోరాడుతానని ఎంపీ హామీ

హస్తినను తాకనున్న విశాఖ స్టీల్ ఉద్యమం

Vizag Steel Plant: విశాఖ ఉద్యమం హస్తినను తాకనుంది. ఇప్పటికే కార్మిక సంఘాలు కార్యచరణను రూపొందించాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎంపీలు అందర్నీ కలిసి.. పార్లమెంట్ వేదికగా పోరాడాలని కోరుతున్నారు.

  • Share this:
    స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల ఆందోళనలను ఏ మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది చివరకల్లా ప్రైవేటీకరణ పూర్తి చెయ్యాలని చూస్తోంది. పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గణనీయమైన పాత్ర పోషించింది. దీంతో కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని అంతా ఆశించారు. కష్టసమయంలోనూ విశాఖ ఉక్కు కార్మికులు రెండింతలు శ్రమించారు. ప్లాంట్ ను లాభాల బాట పట్టించారు. అయినా కేంద్రం మాత్రం ముందుకే వెళ్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సలహాదారులను నియమించింది. వీరిలో ఒకరు లావాదేవీల సలహాదారు కాగా మరొకరు న్యాయసలహాదారు.

    ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ 26,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. దీని సామర్థ్యం సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నులు. ఇందులో సుమారు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు , 17,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా మరో లక్ష మంది వ్యక్తులు విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు.
    కేవలం నష్టాలను సాకుగా చూపించి స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. కానీ గత మూడు నాలుగు నెలల పరిస్థితి మెరుగు పడింది. ఉత్పాదకతతో పాటు.. లాభాలు కూడా పెరిగాయి. అంతే కాదు దేశమంతా కరోనా మహమ్మారిని చూసి గజా గజా వణికిన వేల నేనున్నాను అంటూ స్టీల్ ప్లాంట్ ముందుకొచ్చింది. ఆక్సిజన్ అందక వందలాంది మంది మరణిస్తుంటే.. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాతో ఎన్నో రాష్ట్రాల్లోని ప్రజలకు ఊపిరి పోసింది. అయినా కేంద్రం మనసు మాత్రం మారడం లేదు.

    ఇదీ చదవండి: శ్మశానంగా మార్చి మిజోరాం వెళ్లమంటారా? సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

    కార్మికులు ఎన్ని రకాల పోరాటాలు చేసిన కేంద్రం చెవిన వారి నినాదాలు పడడం లేదు. అందుకే ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు ఈ పోరాటానికి ఇప్ప‌టికే వివిధ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. ఏపీలో ఉన్న ఎంపీలంతా స్టీల్‌ప్లాంట్ కోసం పార్ల‌మెంట్‌లో పోరాడాల‌ని కార్మిక సంఘాలు కొరుతున్నాయి. అందుబాటులో ఉన్న ఎంపీలు అందర్నీ కలుస్తున్నాయి కార్మిక సంఘాలు, మొదట అనకాపల్లి ఎంపీని కలిసి వినతి పత్రం ఇచ్చిన కార్మిక సంఘాలు.. తరువాత ఎంపీ రామ్మోహన్ నాయుడుని కలిశాయి. ఉక్కు ప్రైవేటీకరణ పాలని.. ఆంధ్రుల ఆవేదనను పార్లమెంట్ లో గట్టిగా వినిపించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతల వినతిపై రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయాన్ని ఆపేందుకు రాజీనామాలు చేసే ధైర్యం మాకుంది.. వైసీపీకి చెందిన 28 మందికి ఆ సత్తా ఉందా అని  ప్రశ్నించారు రామ్మోహన్ నాయుడు.  http://

    Published by:Nagesh Paina
    First published: