Home /News /politics /

VIZAG STEEL PLANT GAIN 18 CRORE TURNOVER THIS YEAR THIS IS SECOND HIGHEST RECORD EVER PLANT HISTORY NGS

Vizag steel Plant: రికార్డులు తిరగరాస్తున్న విశాఖ ఉక్కు? ఉద్యమంలోనూ భారీ టర్నోవర్? కేంద్రానికి షాకిస్తున్న కార్మికులు

ఉద్యమ సమయంలో విశాఖ ఉక్కు రికార్డు స్థాయి టర్నోవర్

ఉద్యమ సమయంలో విశాఖ ఉక్కు రికార్డు స్థాయి టర్నోవర్

విశాఖ ఉక్కు కర్మాగారం రికార్డులపై రికార్డుు సాధిస్తోంది. ఈ ఏడాది 18 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసిందని యాజమాన్యం ప్రకటించింది. ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ సాధించడం చరిత్రలో రెండోసారి మాత్రమే. ఉద్యమ సమయంలో ఈ స్థాయిలో లాభాలు రావడంపై కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలు చూసైనా కేంద్రం మనసు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.

ఇంకా చదవండి ...
    విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్న కారణంగా ప్రైవేటీకరణ చేస్తున్పట్టు కేంద్రం పదే పదే చెబుతోంది. అది నిజమేనా? ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా? కార్మికులు వాదిస్తున్నట్టు లాభాల్లో ఉందా..? ఓ వైపు ఉక్కు  ఉద్యమం తీవ్రమవుతున్నప్పుడు ఉత్పత్తికి ఆటంకం కలగాలి? మరి స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఉత్పత్తి పరిస్థితి ఏంటి? వీటిపై విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో టర్నోవర్ నమోదు చేసుకుందని స్పష్టం చేశారు.

    2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు పరిశ్రమ 18 వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ నమోదు చేసినట్లు సంస్థ సీఎండీ పీకే రథ్‌ తెలిపారు. విశాఖ ఉక్కు చరిత్రలోనే ఇది రెండో అత్యధికమని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్‌ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. గతేడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సాధారణ సమయంలో ఈ వృద్ధిని ఎవరూ పట్టించుకోకపోవచ్చు.. కానీ విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, సిబ్బంది ఉద్యమం చేస్తున్నారు. కొందరు కార్మికులు షిప్టుల వారిగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాదాపు 50 రోజుల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో అది ఉత్పత్తిపై ప్రభావం చూపించాలి. కానీ విశాఖ ఉక్కు కార్మికులు ఓవైపు ఉద్యమంలో పాల్గొంటూనే.. ప్రైవేటీకరణ ఆగాలి అంటే సంస్థ లాభాల్లో నడవాలని నిర్ణయించారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. అందుకే సంస్థ ఇప్పుడు రికార్డు స్థాయిలో ఉక్కు ఉత్పత్తి అవుతోంది.

    ఈ 4 నెలల్లో 740కోట్ల నికర లాభం నమోదైందని సీఎండీనే స్వయంగా వెల్లడించారు. మార్చిలో 7 లక్షల 11  వేల టన్నుల ఉక్కు 3 వేల 300 కోట్ల రూపాయలకు విక్రయించామన్నారు. ఈ మార్చిలో కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు, సిబ్బంది, అధికారులను సీఎండీ అభినందించారు. కర్మాగారం చరిత్రలోనే ఈ మార్చిలో అత్యధిక ఆదాయం వచ్చిందని పీకే రథ్‌ తెలిపారు. మార్చి మొత్తం కార్మికులు చాలావరకు ఉద్యమంలో పాల్గొన్న సమయమే. కానీ ఇదే సమయంలో ఇంత ఆదాయం రావడం నిజంగా గొప్ప విషయమే.

    అయినా కేంద్రం మాత్రం ఈ లెక్కలను పట్టించుకోకపోవడం శోచనీయం. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే వ్యూహాల విషయంలో కేంద్రం దూకుడు పెంచింది. ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా... విశాఖ ఉక్కు విక్రయంపై వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ కమిటీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విక్రయ విధి విధానాలను రూపొందిస్తుంది. కర్మాగారానికి ఒక ధరను నిర్ణయిస్తుంది. లీడ్‌ బ్యాంకర్‌గా ఎవరిని నియమించాలో పరిశీలిస్తుంది. ఈ మొత్తం అంశాలపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ కమిటీలో కేంద్ర ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే వారికి స్థానికంగా సహకరించేందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన ఇద్దరు ముఖ్యమైన అధికారులను కూడా కమిటీలో చేర్చారు. ఉక్కు కర్మాగారం విక్రయానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించి.. ప్రక్రియను వేగవంతం చేయడంపై ఈ కమిటీ కీలక సూచనలు చేస్తుంది. కేంద్ర పరిధిలోని ఏదైనా పరిశ్రమను విక్రయించేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చే కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కూడా ఈ కమిటీతో కలిసి పని చేస్తుంది. ఈ కమిటీ పరిశ్రమను కొనసాగించడం మంచిదా? లేక... విక్రయిస్తే మేలా? అనే అంశంపై సలహాలు అందిస్తుంది. ఈ కమిటీ ఏర్పాటుతో విశాఖ ఉక్కు విక్రయం దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసినట్లయింది. భారీగా లాభాలు ఆర్జిస్తున్న సమయంలో విశాఖ ఉక్కును అమ్మేస్తుండడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

    తదుపరి వార్తలు