• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VISKHA STEEL PLANT AGITATION AGAINST PRIVATIZATION UPDATE NGS

Vizag steel Plant: సాగర తీరంలో పోటెత్తిన విశాఖ ఉక్కు ఉద్యమ కెరటాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు

Vizag steel Plant: సాగర తీరంలో పోటెత్తిన విశాఖ ఉక్కు ఉద్యమ కెరటాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు

ప్రశాంతంగా ఉండే సాగర తీరంలో ఉక్కు ఉద్యమ కెరటాలు ఎగసిపడుతున్నాయి.. అసలే ఆకలి మీద ఉన్న ఉద్యమానికి ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యలు మంట పుట్టించినట్టైంది. దీంతో ఉక్కు ఉద్యమ కారులు పిడికిలి బిగించారు.

ప్రశాంతంగా ఉండే సాగర తీరంలో ఉక్కు ఉద్యమ కెరటాలు ఎగసిపడుతున్నాయి.. అసలే ఆకలి మీద ఉన్న ఉద్యమానికి ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యలు మంట పుట్టించినట్టైంది. దీంతో ఉక్కు ఉద్యమ కారులు పిడికిలి బిగించారు.

  • Share this:
    విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉక్కు ఉద్యమం ఉధృతమైంది. విశాఖ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉక్కు నినాదం మార్మోగింది.  వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు రాస్తారోకాలతో రోడ్లను దిగ్బంధించారు.

    ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించడంతో ప్రధాన జంక్షన్లలో గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    నిన్నటి వరకు ఒక ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు. సాగర తీరంలో ఉద్యమ కెరటాలు పోటెత్తాయి. నిన్నటి వరకు వందల్లో ఉన్న ఆందోళనకారుల సంఖ్య.. ఇప్పుడు వేలకు చేరింది. చేయి చేయి కలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఉక్కు పిడికిలి బిగించారు కార్మికులు.  ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. వేలాది మందికి జీవనాధారమైన స్టీల్‌ కంపెనీనిని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  ఉక్కును కాదు.. మా ప్రాణాలను అమ్ముకోండి అంటున్నారు ఉద్యమకారులు.

    విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్లాంట్ గేటు వద్ద రిలే నిరహార దీక్షలు 15 రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టారు. విశాఖలోని కూర్మన్నపాలెం, గాజువాక, ఎన్ఏడీ లలో రాస్తారోకో చేశారు.

    కేవలం విశాఖపట్నంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం విస్తరిస్తోంది. విశాఖ ఉక్కు మన హక్కు నినాదంతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ వద్ద ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. వారి నిరసనకు కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలిపాయి.

    తూర్పుగోదావరి జిల్లాలో సైతం ఆందోళనలు మిన్నంటాయి. అందరూ కలిసి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి.. ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు భాగమై.. కేంద్రం మెడలు వంచాలని కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి.

    మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరకు మావోయిస్ట్ ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదలైంది. ఉక్కు పరిశ్రమని అందరం ఐక్యంగా ఉద్యమించి కాపాడుకుంటేనే 32మంది త్యాగానికి నివాళి తెలిపారు. బీజేపీ, వైసీపీ వేరైనప్పటికి వారు అమలు చేసే విధానాలు మాత్రం ఒక్కటే అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
    Published by:Nagesh Paina
    First published: