• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VISKAKHAPATNAM SARADHAPEETAM SWAMIJI SENSATIONAL COMMENTS ON A SENIOR POLITICAL LEADER NGS

Andhra Pradesh: కేసీఆర్, జగన్ జాతకం సూపర్. ఓ కీలక నేతకు కష్టాలు తప్పవన్న స్వామీజీ

Andhra Pradesh: కేసీఆర్, జగన్ జాతకం సూపర్. ఓ కీలక నేతకు కష్టాలు తప్పవన్న స్వామీజీ

కేసీఆర్, వైఎస్ జగన్

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ ఏడాది జాతకం బాగా కలిసి వస్తుందా? మరి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల పరిస్థితి ఏంటి? విశాఖలోని స్వామీజీ మాత్రం ఓ కీలక నేతకు కష్టాలు తప్పవంటూ పంచాంగం చెప్పారు? ఇంతకీ ఎవరు ఆ కీలక నేత ఇప్పుడు నెట్టింట ఈ ప్రచారం రచ్చ రచ్చ చేస్తోంది.

  • Share this:
    ఉగాది అంటే పంచాగ శ్రవణమే హైలైట్ అవుతుంది. ప్రతి ఏడాది పంచాగ శ్రవణంపై ప్రజలంతా ఆసక్తి చూపిస్తారు. అయితే రాజకీయ నేతలు సైతం ఈ పంచాంగ శ్రవణానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అందుకే ఆయా పార్టీల తరపున ప్రత్యేకంగా పండితులను పిలుపించుకుని వారి జాతకం ఎలా ఉంటుంది అన్నదానిపై ఆరా తీస్తూ ఉంటారు. అయితే ఇలా రాజకీయ నేతలు చెప్పించుకునే పంచాంగ శ్రవణాలు ఎవరికి వారికి అనుకూలంగా ఉంటాయనే విమర్శ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే విశాఖ శారద పీఠం స్వామీజీ చెప్పిన మాటలు ఇప్పుడు ఏపీలో పెను దుమారం రేపుతోంది.

    విశాఖనగరంలోని  శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శారదా పీఠం ఆధ్వర్యంలోని గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఇద్దరూ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ..  ప్లవ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో అన్ని వర్గాల వారికి శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. అయితే ఇతే సందర్భంలో రాజకీయంగా ఈ ఏడాది ఓ పెద్ద నేతకు  చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని జోస్యం చెప్పారు. అయితే ఎవరా నేత అన్నదానిపై ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతానికి  గ్రహాల అనుకూలత సరిగ్గా లేకున్నా తెలుగు రాష్ర్టాలకు మంచే జరుగుతుందని భావిస్తున్నానన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు జగన్, కేసీఆర్ జాతకాలు  చాలా బాగున్నాయన్నారు.  అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయని జోస్యం చెప్పారు.

    ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు  తెలుగు రాష్ట్రాల్లో  తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్వరూపానందేంద్ర స్వామి చెప్పిన ఆ పెద్ద నేత ఎవరు అనే చర్చ మొదలైంది. నెటిజన్లు అయితే ఎవరికి నచ్చిన పేరు వారు చెబుతున్నారు. అయితే స్వరూపానందేంద్ర స్వామి ఓ పెద్ద నేత అన్నారు కానీ.. ఆయన  కేంద్రానికి చెందిన నేతా, లేక రాష్ట్రానికి చెందిన నేతా... తెలుగు నేతా... దక్షిణాది, ఉత్తారది వారా అని క్లారిటీ ఇస్తే బాగుండేది అంటున్నారు., స్వామిజీ చెప్పిన నేత ఎవరై ఉండొచ్చు... ఆయనకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమై ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా  ప్రస్తుతం ఆ చర్చ వైరల్ గా మారుతోంది.

    ఏపీలో రాజకీయాలపైనే ఆయన వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు. నెటిజన్లు అయితే కేవలం చంద్రాబు నాయుడ్ని టార్గెట్ గా చేసుకునే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని పోస్టులు చేస్తున్నారు. మరికొందరైతే పవన్ కళ్యాణ్ పైనే ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  అయితే స్వామీజీ మాత్రం ఎవరి పేరు చెప్పలేదు. దీంతో ఎవరా నేతై ఉంటారని ప్రశ్నిల వర్షం కురుస్తోంది. మరి దీనిపై స్వామీజీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: