జగన్ సర్కార్‌పై వెంకయ్య నాయుడు ప్రశంసలు

. దిశ చట్టం తీసుకొచ్చినజగన్ ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు.

news18-telugu
Updated: December 14, 2019, 12:00 PM IST
జగన్ సర్కార్‌పై వెంకయ్య నాయుడు ప్రశంసలు
వైఎస్ జగన్, వెంకయ్యనాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు వర్షం కురపించారు. దిశ చట్టం తీసుకొచ్చినజగన్ ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. దిశ యాక్ట్ వల్ల సత్వర న్యాయం జరిగే అవకాశాలున్నాయన్నారు. 'మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరపడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా 'ఏపీ దిశ' చట్టానికి ఆమోద ముద్ర వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు వెంకయ్య. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరమన్నారు ఉపరాష్ట్రపతి . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను' అని వెంకయ్య నాయుడు తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేశారు.

దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయనున్నారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>