• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • VISAKHAPATNAM YCP RAJYASABHA MEBER VIJAYSAIREDDY DEMOND 50 PERCENT RESERVATION FOR WOMEN NGS

Andhra Pradesh: మహిళలకు 50 శాతం రిజర్వేషన్: రాజ్యసభలో కేంద్రానికి విశాఖ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

విజయసాయిరెడ్డి

చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 60 శాతం మంది మహిళలకు మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులు దక్కయని గుర్తు చేశారు.

  • Share this:
    రాజకీయాల్లో మహిళల అభ్యున్నతికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లు మహిళలకు ఇవ్వడమే కాకుండా.. పదవులు కూడా భారీ స్థాయిలో ఇచ్చామన్నారు. అలాగే చట్ట సభల్లోనూ, నామినేషన్ పదవుల్లోనూ మహిళలకు పెద్ద పీట వేయాలని విజయసాయిరెడ్డి మరోసారి డిమాండ్ చేశారు.

    చట్ట సభలలోను, నామినేటెడ్‌ పదవుల్లోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని రాజ్యసభలో కోరారు విశాఖ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై సభలో మాట్లాడారు. 1962 లోక్‌సభ ఎన్నికల్లో 46.7 శాతం మంది మహిళా ఓటర్లు పాల్గొనగా 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి అది 67.18 శాతానికి పెరిగిందని ఆయన గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా రాజకీయాలలో గానీ, చట్ట సభలలో గానీ మహిళల ప్రాతినిధ్యం పెరగకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం చాలా దిగువన ఉండి పోయిందన్నారు. 1998లో 95వ స్థానంలో ఉన్న భారతదేశం 2021 నాటికి 148వ స్థానానికి పడిపోవడం చాలా బాధాకరమైన అంశం అన్నారు. దేశంలో రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్ర ప్రదేశ్ లోని తమ ప్రభుత్వం మాత్రం మహిళకు పెద్ద పీట వేస్తోందని గుర్తు చేశారు.

    ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 60 శాతం మంది మహిళలకు మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులు దక్కయని చెప్పారు. మహిళా ప్రాతినిధ్యం దిశగా తమ ప్రభుత్వం ముందుడుగు వేసిందన్నారు. మొత్తం 86 ఉన్నత పదవులలో 52 మంది మహిళలే దక్కించుకున్నారు. ముఖ్యమైన కార్పొరేషన్లలోనూ మహిళలనే మేయర్ లుగా ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఇదో రికార్డు అని సభకు గుర్తు చేశారు. మహిళా సాధికారిత దిశగా, పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు విజయసాయిరెడ్డి.

    ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్షా 50 వేల పంచాయతీలలో 50 శాతం పైగా అంటే 78 వేల పదవులను మహిళలే అలంకరించారన్నారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రిజర్వేషన్లు ఎంత అవసరమో దీనినిబట్టి స్పష్టం అవుతోందన్నారు. కాబట్టి అన్ని నామినేటెడ్‌ పోస్టులు, చట్ట సభలలో మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్‌ చేస్తూ చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చట్టం రూపకల్పనకు కృషి చేయవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో  చాలాచోట్ల అమలు చేస్తున్నామన్నారు. చట్టం తీసుకోస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుందన్నారు.
    Published by:Nagesh Paina
    First published: