Home /News /politics /

VISAKHAPATNAM STEEL PLANT WORKERS PROTEST AGAINST NIRMALA SITARAMAN VIZAKHAPATNAM TOUR NGS

Vizag Steel Plant: విశాఖలో నిర్మలా సీతారామన్.. ఎయిర్‌పోర్ట్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత

నిర్మలా సీతారమన్ పర్యటనలో ఉద్రిక్తత

నిర్మలా సీతారమన్ పర్యటనలో ఉద్రిక్తత

విశాఖస్టీల్ ప్లాంట్ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుంటే.. కేంద్రం ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేసేది లేదంటోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని లేదంటే మూసేయడమే మార్గమని నిర్ణయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు విశాఖ ఉక్కు ఉద్యమకారులు.. దీంతో విశాఖలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇంకా చదవండి ...
    కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయితే ముందస్తుంగా ఆమె వస్తున్నారనే సమచారం ఉండడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఆమె పర్యటనను అడ్డుకోవాలని భావించారు. దీంతో మందస్తుంగానే హై అలెర్ట్ ప్రకటించారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు వందల సంఖ్యలో కార్మికులు చేరుకుని నినదాలు చేశారు. అప్పటికే భారీగా చేరుకున్న భద్రతా దళలాలు స్టీల్ ప్లాంట్ వర్కర్లను దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉక్కు ఉద్యోగులు. తమ సమస్యను కేంద్రానికి తెలియజేసే హక్కు కూడా లేదా అని నిలదీశారు. అయినా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించిన ఉక్కు కార్మిర్మికులు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ అక్కడ నుంచి పోలీసులు తరలించిన తరువాత ఆమె బయటకు వచ్చారు..

    మరోవైపు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పదే పదే ఈ వ్యవహారంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి వాటా ఉపసంహరణ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ(Ap cm ys jagan) రాసిన సంగతిని ప్రస్తావిస్తూ వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం స్టీల్‌ప్లాంట్ వ్యవహారంపై ఆందోళనను పెంచేదిగా ఉంది.

    తాజా సమాధానంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పెట్టుకున్న ఆశల్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవల్సిందే. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని తెలుస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag steel plant) విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా వైఖరితో ఆందోళన మరింత పెరిగే ప్రమాదం కన్పిస్తోంది.ఓ వైపు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు(Visakha steel plant privatisation) వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుండగానే.. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్ని సాధ్యమైతే ప్రైవేటీకరించడం లేనిపక్షంలో శాశ్వతంగా మూసివేయడమే కొత్త పబ్లిక్ సెక్టార్ విధానమని కేంద్రం(Central government)స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు నుంచి వందశాతం వాటాను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి 27వ తేదీన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేదే లేదని వెల్లడించింది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nirmala sitharaman, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

    తదుపరి వార్తలు