Home /News /politics /

VISAKHAPATNAM STEEL PLANT PRIVATIZATION FIGHT HAS NOW HIT DELHI NGS

Vizag Steel Plant: హస్తిన వీధులు అదిరిపడేలా విశాఖ ఉక్కు ఉద్యమం : భారత్ బంద్ తో కేంద్రం దిగి వస్తుందా?

ఉప్పెనలా విశాఖ ఉక్కు ఉద్యమం

ఉప్పెనలా విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ ఉక్కు ఉద్యమం హద్దులు చెరిపేస్తోంది. మొన్నటి వరకు విశాఖ నుంచి రాష్టం మొత్తం తాకిన విశాఖ ఉక్కు ఉద్యమ సెగ.. ఇప్పుడు హస్తిన వీధుల్లో హీటు పుట్టిస్తోంది. శుక్రవారం బారత్ బంద్ తో కేంద్రం మెడలు వంచాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మారుమోగుతూనే ఉంది. కేవలం విశాఖలోనే కాక ఏపీ వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగసి పడుతోంది. 40 రోజులకు పైగా కార్మిక సంఘాలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. ఓ వైపు రిలే నిరహార దీక్షలు చేస్తునే.. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నాయి. శుక్రవారం భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఆ వెంటనే సమ్మె సరైన మోగించాలని నిర్ణయించాయి. కార్మికుల నిరసన గళం కేంద్రం చెవిన పడుతోందో లేదో తెలియదు కాని.. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు.

    ప్రస్తుతం ఉక్కు ఉద్యమం ఉప్పెనలా మారుతోంది. స్టీల్‌ సిటీ నుంచి దేశ రాజధాని హస్తినకు నిరసనలు విస్తరించాయి. విశాఖలో మొదలైన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు.. ఇపుడు ఢిల్లీ వీధులను కూడా తాకింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. సేవ్ వైజాగ్ స్టీల్‌ నినాదంతో జరుపుతున్న పోరాటానికి జాతీయస్థాయి నేతల మద్దతు కూడగట్టే పనిలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన కమిటీ సభ్యులు వైసీపీ ఎంపీలను కలిసారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా తమ వంతు కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు.

    కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు చెబుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర పెద్దలను కోరాతామన్నారు. ఒక్క పైసా కూడా సాయం చేయని కేంద్రం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు అన్నారు. తమ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు దొరికిందని స్పష్టంచేశారు.

    స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 18న అన్ని కార్మిక సంఘాలతో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు అన్ని జాతీయస్థాయి నేతలతో పాటు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయట్ హాజరవుతారని కమిటీ సభ్యులు తెలిపారు. మరోవైపు భారత్ బంద్ ను సక్సెస్ చేసిన తరువాత.. సమ్మెకు సిద్ధమవ్వాలని కార్మిక సంఘాలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనిపై యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చాయి కార్మిక సంఘాలు.. దీంతో ఏ క్షణమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరెన్ మోగే అవకాశం ఉంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Delhi, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు