విశాఖకు రైల్వే జోన్.. పీయూష్ గోయల్ ప్రకటన.. కొత్త జోన్ పేరు SCOR

విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

news18-telugu
Updated: February 28, 2019, 8:13 AM IST
విశాఖకు రైల్వే జోన్.. పీయూష్ గోయల్ ప్రకటన.. కొత్త జోన్ పేరు SCOR
పీయూష్ గోయల్
  • Share this:
ఉత్తరాంధ్ర వాసుల కల అయిన విశాఖ పట్నం రైల్వే జోన్‌ను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్.. దీనిపై అధికారిక ప్రకటన వెలువరించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. అందులో కొంత భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలుపుతామన్నారు. మిగిలిన భాగాన్ని ఒడిశాలోని రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రెండో భాగం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంటుంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయని పీయూష్ గోయల్ చెప్పారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే జోన్‌కు SCOR అని పేరు పెట్టారు. అంటే సౌత్ కోస్ట్ రైల్వే.

visakha railway zone, railway zone, vizag railway zone, visakha railway zone latest news, visakhapatnam railway zone, vizag railway zone news, visakha railway zone news, visakha railway zone story, about visakha railway zone, visakha railway zone benefits, modi about visakha railway zone, Piyush Goyal, Railway Minister Piyush Goyal , విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్, రైల్వే జోన్‌ను ప్రకటించిన పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, పీయూష్ గోయల్ రైల్వే జోన్, పీయూష్ గోయల్ విశాఖ రైల్వే జోన్
పీయూష్ గోయల్ (File)

విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలనేది ఉత్తరాంధ్ర వాసుల 30 ఏళ్ల కల. వారి కల ఇన్నాళ్లకు సాకారమైంది. అయితే, వాల్తేరు డివిజన్‌లోని ఏయే భాగాలను రాయగఢ్‌లో కలుపుతారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, వాల్తేరు డివిజన్ మీద ఒడిశా అభ్యంతరాలు చెప్పడంతో అది వాయిదా పడుతూ వస్తోంది. చివరకు వాల్తేరు డివిజన్‌‌ను రెండు భాగాలుగా చేసి కొత్త జోన్‌కు కేంద్రం అంకురార్పణ చేసింది.

visakha railway zone, railway zone, vizag railway zone, visakha railway zone latest news, visakhapatnam railway zone, vizag railway zone news, visakha railway zone news, visakha railway zone story, about visakha railway zone, visakha railway zone benefits, modi about visakha railway zone, Piyush Goyal, Railway Minister Piyush Goyal , విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్, రైల్వే జోన్‌ను ప్రకటించిన పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, పీయూష్ గోయల్ రైల్వే జోన్, పీయూష్ గోయల్ విశాఖ రైల్వే జోన్
ప్రతీకాత్మక చిత్రం

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏపీ బీజేపీ నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. దీంతోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే అంశంపై పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.

visakha railway zone, railway zone, vizag railway zone, visakha railway zone latest news, visakhapatnam railway zone, vizag railway zone news, visakha railway zone news, visakha railway zone story, about visakha railway zone, visakha railway zone benefits, modi about visakha railway zone, Piyush Goyal, Railway Minister Piyush Goyal , విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్, రైల్వే జోన్‌ను ప్రకటించిన పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, పీయూష్ గోయల్ రైల్వే జోన్, పీయూష్ గోయల్ విశాఖ రైల్వే జోన్
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

మార్చి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పీయూష్ గోయల్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేయగా, విశాఖపట్నం ఎంపీగా బీజేపీ అభ్యర్థి హరిబాబు గెలుపొందారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మీద ఆయన పోటీ చేసి విజయం సాధించారు. సొంత పార్టీ ఎంపీ ఉన్న స్థానంలో రైల్వే జోన్ ఇన్నాళ్లూ ప్రకటించకపోవడం బీజేపీకి ఇబ్బందిగా మారేది. ఇప్పుడు పీయూష్ గోయల్ ప్రకటనతో బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది.
First published: February 28, 2019, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading