VISAKHAPATNAM MUNICIPAL CORPORATION ELECTIONS WILL BE KEY FOR EX MINISTER GANTA SRINIVASARAO POLITICAL FUTURE FULL DETAILS HERE PRN BK
Ganta Srinivas: ఏపీలో ఆ నేతకు కీలకంగా మారిన మున్సిపల్ ఎన్నికలు.., ఫలితాలపైనే ఫ్యూచర్ ప్లాన్స్..
గంటా శ్రీనివాసరావు, చంద్రబాబు, జగన్ (ఫైల్)
మాజీ మంత్రి ప్రధాన అనుచరులు సోమవారం వైసీపీ పార్టీ కండువాలు కప్పుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేత అనుమతి లేనిదే తన అనుచరులు అధికారపార్టీలోకి అది మున్సిపల్ ఎన్నికలకు ముందు వెళ్లతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
గంటా శ్రీనివాస్ రావు ఏపీ రాజకీయాల్లో ఈ నేత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీలతో సంబంధం లేకుండా అధికారం ఎక్కడుంటే అక్కడుంటారు ఈ నేత. 2019 ఎన్నికల తరువాత ఈయన పెద్దగా ఎక్కడ కనిపించలేదు. తన సొంత వ్యాపారాలు చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న టీడీపీ కూడా దూరంగా ఉన్నారు. కీలక సమావేశాలకే కాదు పార్టీ తలపెట్టిన ముఖ్య కార్యక్రమాల్లో కూడా ఈయన జాడ ఎక్కడ ఎప్పుడు కనిపించడం లేదు. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మళ్లీ ఈ నేత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. త్వరలో అధికారపార్టీలో చెరబోతున్నారనే వార్త ఇప్పుడు తెలుగు తమ్ముళ్లును కలవరపెడుతోంది. పార్టీ అధికారం కొల్పోయాక కీలక నేతలు, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం ఇప్పుడు చంద్రబాబు అండ్ కో కు వింగుడుపడడం లేదు. అందుకే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
వైజాగ్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను బాబు గంటా చెతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న అధికారపార్టీ కేడర్ ను మానసికంగా దెబ్బతియడానికి ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం తెరపైకి తీసుకొచ్చారనేది ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తోన్న వాదనలు. ఏది ఎమైనా ఈ మున్సిపల్ ఎన్నికలు ఈ నేత భవిత్యం ఈ ఎన్నికలతో తెలిపోనుందనే ప్రచారం కూడా ఇప్పటికే పార్టీ ఒక వర్గం చేస్తోంది. ఈ ఫలితాలను బేరీజు వేసుకున్న తరువాత గంటా పార్టీ మారే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారనేది సమాచారం. ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక నేతగా వ్యవహారించారు.
అయితే దీని కంటే ముందు రెండు సార్లు జగన్ పార్టీలో చెరడానికి ప్రయత్నాలు చేసినప్పటికి కొన్ని కారణాల వలన అవి వర్కవుట్ అవ్వలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీలో కీలక నేతలను సంప్రదించారు గంటా శ్రీనివాస్ రావు. జగన్ నో చెప్పిన తరువాత టీడీపీలో చేరారు. అధృష్టం కొద్దీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ 2019 ఎన్నికల సమయంలో కూడా టీడీపీ కి వ్యతిరేక గాలి వీస్తోంది అనే సమాచారంతో మళ్లీ వైఎస్ఆర్సీపీని సంప్రదించారు అయితే చివరి నిముషం వరకు ఈయన పార్టీకి వస్తారనే ప్రచారం చేసిన వైసీపీ శ్రేణులు ఎమైందో ఎమో కానీ మళ్లీ అధినేత జగన్ నో అనే అన్నారు. దీంతో టీడీపీ నుంచే బరిలో దిగారు గంటా. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘార పరాజయం తరువాత సైలెంట్ అయిపోయారు.
మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ మారే అంశం తెరపైకొచ్చింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కామెంట్స్ తో ఈ ప్రచారం ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై చక్కర్లు కొడుతుంది. గంటా శ్రీనివాస్ రావు తమ పార్టీలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పంపించారని అయితే అవి పరిశీలిస్తోన్నమని ఆయన వ్యాఖ్యనించారు. అయితే సాయిరెడ్డి వ్యాఖ్యలపై గంటా విరుచుకుపడుతున్నారు. వైజాగ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇలాంటి అబద్దపు వ్యాఖ్యలు చేశారని తాను టీడీపీలోనే ఉన్నానని ఉంటానని కూడా ప్రకటించారు.
అయితే ఈ మాజీ మంత్రి ప్రధాన అనుచరులు సోమవారం వైసీపీ పార్టీ కండువాలు కప్పుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేత అనుమతి లేనిదే తన అనుచరులు అధికారపార్టీలోకి అది మున్సిపల్ ఎన్నికలకు ముందు వెళ్లతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. మొత్తని ముచ్చటగా మూడో సారి ఈ నేత చేస్తోన్న ప్రయత్నం ఫలిస్తోందో లేదో చూడా అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.