Ganja sales in Amazon: గంజాయి గ్యాంగ్ (Ganja Gang) అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏపీలో గంజాయి సరఫరా పై భారీగా విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) విపక్షాలు పదే పదే విమర్శిస్తున్నారు. ఇక గంజాయి సరఫరా ఏ రాష్ట్రంలో బయట పడ్డా.. లింకులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తో ఉంటున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ (Viskhapatnam Agency) నుంచి భారీగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. దీంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సరఫార నిలుపుదలపై ఫోకస్ చేసింది. దీంతో విశాఖపట్నం వచ్చిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gowtham Sawang).. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి గంజాయి సాగు ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా అక్రమంగా సరఫరా చేస్తే కఠినంగా కేసులు పెట్టాలని సూచించారు. ఇలా గంజాయి సరఫరాపై పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం(NCB), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో గంజాయి గ్యాంగ్ రూటు మార్చింది. మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ-కామర్స్ సంస్థల్లో ప్రధానమైన అమెజాన్‌ను అడ్డాగా చేసుకుంది. ఎంతో తెలివిగా పోలీసులకు చిక్క కుండా కొత్త మార్గంలో గంజాయిని ఈజీగా విక్రయించారు. కానీ ఆలస్యంగానైనా దీన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఇద్దరు కొనుగోలుదారులను అరెస్టు చేశారు. వెంటనే అమెజాన్ (Amazon)కు నోటీసులు జారీ చేశారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్వాలియర్ లోని రెండు డెలివరీ హబ్‌ల ద్వారా ‘డ్రై స్టీవియా’ పేరుతో గంజాయి విక్రయాలను ప్రారంభించారు. నిజానికి స్టీవియా అనేది చక్కెరకు ప్రత్యామ్నాయం. గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహులు టీ/కాఫీల్లో, స్వీట్లలో స్టీవియాను చాలామంది వాడుతూ ఉంటారు. ఆ పేరుతో ఇప్పటి వరకు 1.10 కోట్ల విలువ చేసే గంజాయిని అమెజాన్‌లో దుండగులు అమ్మేసినట్టు గ్వాలియర్ గుర్తించారు. ఈ ముఠాకు చెందిన కల్లు పవయ్య, బ్రిజేంద్ర తోమర్‌లను అరెస్టు చేసి, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే
నిందితుల్లో ఒకరైన సూరజ్ హెర్బల్ ప్రోడక్ట్స్, కరివేపాకు విక్రేతగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకుని గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అతడిపై నిఘా పెట్టారు. అప్పటికే అతడు తరలించిన గంజాయిని మధ్యప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, రాజస్థాన్ కూడా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అమెజాన్‌కు మధ్యప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ వ్యవహారంలో లాజిస్టిక్ సదుపాయంతో పాటు డెలివరీ సదుపాయం కూడా అమెజాన్ కల్పించిందని, ఎక్కడా దీన్ని ఆ కంపెనీ గుర్తించలేకపోయిందని పోలీసు ఉన్నతాధికారి మనోజ్ సింగ్ తెలిపారు. పోలీసుల సమన్లపై అమెజాన్ కూడా స్పందించింది. ఈ అక్రమ రవాణా కేసులో పోలీసుల దర్యాప్తుకు కంపెనీ సహకరిస్తుందని తెలిపింది. భారతీయ చట్టాలకు లోబడి గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తమ వేదికగా విక్రయించడం లేదని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణాపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను వినియోగించినట్లు వెలుగుచూసింది. టన్ను గంజాయిని ఈ విధంగా తరలించినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లో గంజాయితో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని విశాఖ నుంచి నాలుగు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు వారు చెప్పడంతో పోలీసులు ఆశ్చర్య పోయారు. దీత విపక్షాలు ఆరోపణలు నిజమే అని తేలుతోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Andhra Pradesh, AP News, Crime news, Ganja case, Visakha