విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమరావతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఆయన ఆయన పార్టీ కండువా మెడలో వేసుకోలేదు. వాసుపల్లి గణేష్ కుమారులు ఇద్దరికీ కండువాలు కప్పిన సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ ‘ఈ రోజు వైసీపీలో జాయిన్ కావడం ఆనందంగా ఉంది. నా కుమారులు కూడా చేరారు. గట్స్ ఉన్న నాయకుడిగా జగన్ కనిపించారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతుంది ఆయన ధైర్యమే. అనేక సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందరికీ చేరుతున్నాయి. టీడీపీ ఇక ముందుకువస్తోందని నాకు అనిపించడం లేదు. విశాఖ ఏక్సిక్యూటివ్ కాపిటల్ ఇచ్చిన ఘనత ఆయనిది. అనేక పనులు నా నియోజకవర్గంలో ఉన్నాయి. అవన్నీ జగన్ వల్లే సాధ్యం. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి జగన్కు గిఫ్ట్ ఇస్తాం.’ అని అన్నారు.
వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గణేష్ కుమారులు, మొత్తం కుటుంబం చాలా విద్యావంతమైన కుటుంబమన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఆయన ఉద్దేశ్యం మంచిదన్నారు. వాసుపల్లి గణేష్ పార్టీలోకి రావడం కొండతా బలాన్ని ఇస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీలో ఈ రోజు విశాఖలో తుడుచుపెట్టుకు పోతుందండంలో సందేహం లేదన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధిని గమనించి టీడీపీలో విద్యావంతులు వైసీపీలోకి వస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో మరింతగా చూస్తారన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదన్నారు. అసలు ప్రతిపక్షం ఉంటే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేదని, అసలు ప్రతిపక్షమే ఉండదని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.