చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా అధికారపార్టీలోకి వెళితే ఇదే దారిలోనే నడుస్తారని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: September 19, 2020, 9:26 AM IST
చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పటికే ఎమ్మెల్యేల జంపింగ్, నేతలపై కేసులతో టీడీపీ కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పబోతున్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చర్చలు జరపనున్నారు. ఐతే వైసీపీ కండువా కప్పుకోకుండా.. పార్టీలో చేరకుండానే.. సీఎం జగన్‌కు మద్దతు తెలపనున్నారు వాసుపల్లి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి బాటలోనే ఆయన పయనించనున్నారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గ నుంచి టీడీపీ టికెట్‌పై రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వాసుపల్లి గణేష్. 2009లో ఓడిపోయినప్పటికీ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్ రావుపై 3,729 మెజార్టీతో గెలుపొందారు.

కొద్దిరోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వాసుపల్లి గణేష్. వైఎస్సార్‌సీపీ పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. విశాఖ రాజధానికి టీడీపీ వ్యతిరేకిస్తోందన్న కారణంతోనే.. ఆయన టీడీపీకీ వీడేందుకు సిద్ధపడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే వైసీపీకి బయటి నుంచి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలన్న ముందస్తు వ్యూహంతోనే.. వైసీపీలో చేరకుండా జగన్ సర్కార్‌కు అండగా ఉండనున్నారు.

ఇంతకు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు కూడా ఇదే రూట్లో వెళ్లారు. వైసీపీలో చేరకుండా.. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్సార్‌సీపీలో అధికారికంగా చేరికపోయినప్పటికి బయటి నుంచి మద్దతు తెలిపారు. నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా అధికారపార్టీలోకి వెళితే ఇదే దారిలోనే నడుస్తారని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు వాసుపల్లి గణేష్ నిర్ణయంతో టీడీపీ శ్రేణులు మరింత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐతే ఎవరు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని.. కార్యకర్తలే తమ పార్టీ బలమని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading