• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • VISAKHA MUNICIPAL ELECTIONS ALL PARTY LEADERS FOCUS THEIR RELATIVES NGS

AP Municipal Elections: గ్రేటర్ విశాఖ బరిలో సకుటుంబ సపరివార సమేతం?

AP Municipal Elections: గ్రేటర్ విశాఖ బరిలో సకుటుంబ సపరివార సమేతం?

మున్సిపల్ ఎన్నికల ప్రచారం

గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో బంధువుల హడావుడి పెరిగింది. కీలక నేతలంతా తమ బంధువులను వెంట పెట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సారి బరిలో దాదాపు అందరు నేతలు తమ బంధువులో మున్సిపల్ బరిలో దింపారు.

 • Share this:
  ఏపీ వ్యాప్తంగా విశాఖ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి.. మూడు మేయర్ పీఠాన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యంగా వైసీపీకి ఈ ఎన్నిక డూ ఆర్ డైలా మారింది. ఎందుకంటే వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అయినా విశాఖలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు బ్రేకులు పడే ప్రమాదం ఉంటుంది. విపక్షాలు సైతం ప్రజామోదం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించే ప్రమాదం ఉంది. అందుకే విశాఖ మున్సిపల్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

  ఇటు టీడీపీ సైతం గెలిచేందుకు కాస్త అవకాశం ఉన్నవాటిలో విశాఖ మొదటిది అని భావిస్తోంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటోంది. దానికితోడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలుపొందింది. అయితే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీ మారినా.. ఆ నియోజకవర్గానికి చెందిన కేడర్ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. గణేష్ వెంట వెల్లిన కొందరు కూడా వెనక్కు వచ్చేశారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ పట్టు నిలుపుకుంటే గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది. అందుకే శర్వ శక్తులూ వడ్డుతోంది.

  జనసేన-బీజేపీ కూటమి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడి యూత్ ఓటర్లు జనసేన వెంటే ఉంటారని ఆ పార్టీ భావిస్తోంది. పవన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. ఓడిపోయినా భారీగానే ఓట్లు పడ్డాయి. ఆ ఓటు బ్యాక్ చీలకుండా ఉండాలని.. దానికి తోడు బీజేపీ ఓట్లు కూడా తోడైతే గెలుపు పెద్ద కష్టం కాదని భావిస్తోంది.

  ఇలా ఏ పార్టీకి ఆ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. అందుకే గెలుపు కోసం తమ కుటుంబ సభ్యులనే దింపాయి ప్రధాన పార్టీలు. దాదాపు ఎక్కువ వార్డుల్లో కీలక నేతల బంధువులే బరిలో ఉండడం ఈసారి ప్రత్యేకంగా మారింది. గ్రేటర్ విశాఖ నగర కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల్లో నేతలు తమ కుటుంబీకులను పోటీలో నిలిపారు. అందుకే ఈ నెల 10న జరిగే జీవీఎంసీ పాలకవర్గ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి ప్రచారం చేస్తున్నారు.

  విశాఖలో 6వ వార్డుకు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న లక్ష్మీప్రియాంక ఎవరో కాదు.. స్వయాన మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె. ఇక 12వ వార్డు వైసీపీ అభ్యర్థి అక్కరమాని రోహిణి... ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయనిర్మల బంధువు. 18వ వార్డు వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి.. మాజీ కార్పొరేటర్‌ విజయచంద్రకి సమీప బంధువు. 21వ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న చెన్నుబోయిన పద్మజ.. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ భార్య. 14వ వార్డు వైసీపీ అభ్యర్థి కటారి అనీల్‌ కుమార్‌ రాజు... ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుకు సన్నిహితుడు. 92వ వార్డులో వైసీపీ నుంచి పోటీలో నిలిచిన బెహరా వెంకట స్వర్ణ లతా శివదేవి.. జీవీఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బెహరా భాస్కరరావు సతీమణి. 91వ వార్డు వైసీపీ అభ్యర్థి కుంచ జోత్స్న.. జీవీఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బెహర భాస్కరావుకు కోడల వరుస అవుతారు. ఇక 89వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్‌... మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌కు సమీప బంధువు. 74వ వైసీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్ఢి.. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు. 75వ వార్డు వైసీపీ నుంచి బరిలో ఉన్న తిప్పల ఎమిలీ జ్వాలా... ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోడలు. 68వ వార్డు వైసీపీ అభ్యర్థి గుడివాడ వెంకట సాయి అనూష... అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కు వదిన.

  కేవలం వైసీపీ మాత్రమే కాదు ఇతర పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 26వ వార్డు టీడీపీ అభ్యర్థి శ్రావణి... మాజీ కార్పొరేటర్‌ ముక్కా ముత్యాలనాయుడు కుమార్తె. 97వ టీడీపీ అభ్యర్థి ఎస్‌.వసంత... మాజీ మంత్రి మృణాళిని బంధువు. 63వ వార్డు నుంచి పోటీ చేస్తున్న గళ్ల చిన్న... మాజీ కార్పొరేటర్‌ గళ్ల శ్రీనివాసరావు సోదరుడు. మేయర్ రేసులో ఉన్న టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు... మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణకు సోదరుడు. మాజీ ఎంపీపీ మహాలక్ష్మి కుమారుడు. 67వ వార్డు టీడీపీ అభ్యర్థి పి.శ్రీను.. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావుకు తమ్ముడి వరుస.

  జనసేన పార్టీ తరపున కూడా కుటుంబ సభ్యులో బరిలో ఉండడ విశేషం. 58వ వార్డు జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అంగ దుర్గాప్రశాంతి... మాజీ కార్పొరేటర్‌ అప్పలరాజు తమ్ముడి కూతురు. 75వ వార్డు అభ్యర్థి కోన పద్మ... జనసేన గాజువాక ఇన్‌ఛార్జి కోన తాతారావు మరదలు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సారి ఎన్నికల్లో అందరూ బంధువర్గాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: