ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ... టీడీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్

మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ విషయంలో సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.

news18-telugu
Updated: August 29, 2019, 1:21 PM IST
ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ... టీడీపీ ఎమ్మెల్యే కొత్త డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 29, 2019, 1:21 PM IST
ఏపీ రాజధాని అంశంపై కొనసాగుతున్న గందరగోళానికి ప్రభుత్వం త్వరగా ముగింపు పలకాలని మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదే సమయంలో విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండటానికి విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని వివరించారు. అమరావతి భూకుంభకోణం జరిగితే అధికారంలో ఉన్నవారు తేల్చాలన్నారు. గతంలో అమరావతి రాజధానికి ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి సీఎం జగన్ కూడా అంగీకరించారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు.

అప్పట్లో జగన్ అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలను ఆయన చదివి వినిపించారు. రాజధాని పెట్టే చోట 30 వేల ఎకరాలు అవసరమని జగన్ చెప్పినట్టు ఆయన వ్యాఖ్యానించారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలోనూ విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు మొగ్గు చూపారని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం 30వేల ఎకరాలకు పైగా ఇచ్చిన రైతుల్లో ఎంతో ఆందోళన ఉందని.. దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని గంటా కోరారు. నేడు సీఆర్డీయే అధికారులతో సీఎం జగన్ సమావేశమవుతున్న సందర్భంగా... దీనిపై ఆయన కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించాలని గంటా కోరారు.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...