Vinayaka Chavithi Controversy: వినాయకుడి చుట్టూ ఏపీ రాజకీయాలు... ఉత్సవాల రద్దుపై ప్రజల ఆగ్రహం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) వినాయకుడి (Vinayaka Chavithi) చుట్టూ తిరుగుతున్నాయి. ఉత్సవాలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • Share this:
  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  వినాయక చవితి (Vinayaka Chavithi). దేశవ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ. వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిరోజుల పాటు గణేశుడికి విశేషపూజలు చేసి తరిస్తారు. అంతేకాదు నిమజ్జన్నాన్ని ఘనంగా నిర్వహించి ఆనందోత్సాహల మధ్య గణనాథుడ్ని గంగలోకి సాగనంపుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) వినాయకుడి చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించిన నేపథ్యంలో పండుగపై రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ఆంక్షలు విధించింది. బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించవద్దని.. ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఊరేగింపులు, నిమజ్జనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ తీరుపై పార్టీలే కాదు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  సెప్టెంబర్ 2వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) తండ్రి.. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి (YSR Death Annivarsary)ని ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒకేచోట గుంపులు గుంపులుగా చేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు లేని కరోనా వినాయక చవితి ఉత్సవాలకు వచ్చిందా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో హై అలర్ట్..


  ఇక భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) అయితే ఒక అడుగు ముందుకేసి సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి కావడం వల్లనే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వినాయక చవితి వేడుకలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడని మండిపడుతున్నారు. ఈ నిబంధనలు వైఎస్ వర్ధంతి సమయంలో గుర్తురాలేదా..? అని కమలనాథులు నిలదీస్తున్నారు.

  ఇది చదవండి: కాంట్రాక్టర్ కు వైసీపీ లీడర్ వార్నింగ్... అధికారపార్టీకి మళ్లీ తలనొప్పులు..


  వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగింది. కర్నూలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును (AP BJP President Somu Veerraju) పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం వెనుక కుట్ర ఉందని సోము వీర్రాజు ఆరోపించడం రాజకీయం మరింత వేడెక్కింది. సోమవారం కూడా బీజేపీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో రాజకీయాలన్నీ గణనాథుడి చుట్టూనే తిరుగుతున్నాయి.

  ఇది చదవండి: శేషాచలంలో రియల్ పుష్ప మూవీ సీన్... స్మగ్లర్లు ఎలా చిక్కారంటే..!


  మరో వైపు ప్రభుత్వ ఆంక్షలతో తమకు సంభంధం లేదన్నట్లు చాలా చోట్ల చవితి వేడుకలకు నిర్వహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికంగా ఉండే అధికార పార్టీ చోటామోటా నేతలు వీరికి అండగా ఉంటూ స్థానిక పోలీసులపై ఒత్తిడులు తెస్తున్నారని తెలుస్తోంది. అటు నాయకులకు నచ్చచెప్పలేక ఇటు పైఅధికారుల ఆజ్ఞలను పాటించలేక పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కొపం అన్నట్లు ఉందని పోలీసులు వాపోతున్నారు. పలుచోట్ల ఉత్సవాలకు అనధికారిక అనుమతులిచి చేతులు దులుపుకుంటే బెటర్ అని మరికొందరు భావిస్తున్నారట. మొత్తానికి వినాయక చవితి వ్యవహారం గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ రంగు పులుముకోవడంపై పలువురు మండిపడుతున్నారు.
  Published by:Purna Chandra
  First published: