మంత్రులు కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లిలకు చేదు అనుభవం..

మంత్రులు తమ సమస్యలు వినేందుకు కనీసం కారు కూడా దిగలేదని ఆందోళనకారులు మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.

news18-telugu
Updated: September 14, 2019, 12:51 PM IST
మంత్రులు కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లిలకు చేదు అనుభవం..
కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లి దయాకర్ రావు
  • Share this:
జగిత్యాల జిల్లా పర్యటనలో మంత్రులు కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లి దయాకర్ రావులకు చేదు అనుభవం ఎదురైంది.తాగునీరు,సాగునీరు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొడిమ్యాల మండలం రామ్‌నగర్ వాసులు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తాగునీటి సమస్యలపై సమాధానం చెప్పాలని నిలదీశారు.మంత్రులు కారు దిగకపోవడంతో తీవ్రంగా మండిపడుతూ విమర్శలు గుప్పించారు.పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా ఆందోళనకారుడు ఒకరు మాట్లాడుతూ.. కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలకు తాగునీరు,సాగునీరు అందడం లేదన్నారు. కలెక్టర్లకు,ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. పోతారం రిజర్వాయర్ ద్వారా తమ గ్రామాలకు నీళ్లు అందించాల్సి ఉన్నా.. అధికారులు,మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రులు తమ సమస్యలు వినేందుకు కనీసం కారు కూడా దిగలేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.

Published by: Srinivas Mittapalli
First published: September 13, 2019, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading