వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం.. ఆమెను ట్రాక్టర్‌కు కట్టేసి..

లావణ్య భర్త ఉపాధి కోసం గల్ఫ్‌కి వెళ్లడంతో కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం నడుస్తోంది. ఇటీవల విషయం నారాయణ భార్యకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు.

news18-telugu
Updated: July 18, 2019, 1:04 PM IST
వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం.. ఆమెను ట్రాక్టర్‌కు కట్టేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఓ మహిళను గ్రామస్తులు చితకబాదిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. బోనాల గ్రామానికి చెందిన లావణ్య అనే వివాహితకు.. పండుగ నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. లావణ్య భర్త ఉపాధి కోసం గల్ఫ్‌కి వెళ్లడంతో కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం నడుస్తోంది. ఇటీవల విషయం నారాయణ భార్యకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషులు వారిద్దరిని మందలించి.. ఎవరి బతుకు వారు బతకాలని సూచించారు.

అయితే పెద్ద మనుషుల మాటను పట్టించుకోని లావణ్య-నారాయణ.. గ్రామం నుంచి పారిపోయారు. సిరిసిల్లలోని శివనగర్‌లో ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. నారాయణ భార్యకు విషయం తెలియడంతో.. బంధువులను వెంటపెట్టుకుని ఆమె అక్కడికి వెళ్లింది. అంతా కలిసి నారాయణను ఇంటికి తీసుకొచ్చారు. అయితే నారాయణ కోసం లావణ్య బోనాల గ్రామానికి వెళ్లడంతో.. గ్రామస్తులు ఆమెను నిర్భంధించి ట్రాక్టర్‌కు కట్టేసి చితకబాదారు. ఘటనపై కేసు నమోదైందా లేదా అన్నది తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>