• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VILLAGERS AVOIDING TO FILE NOMINATIONS IN BUTCHEMPETA PANCHAYAT OF EAST GODAWAR DISTRICT OF ANDHRA PRADESH BECAUSE OF DEATH FEAR HERE ARE THE DETAILS PRN

AP Pacnahyat Elections: అక్కడ గెలిస్తే చావు ఖాయం.. నామినేషన్ వేయడానికే జంకుతున్న జనం

AP Pacnahyat Elections: అక్కడ గెలిస్తే చావు ఖాయం.. నామినేషన్ వేయడానికే జంకుతున్న జనం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో నామినేషన్ వేసేందుకు జనం భయపడిపోతున్నారు. ఓడితే ఫర్వాలేదు. పొరబాటున గెలిస్తే చావాల్సిందేనని వణికిపోతున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. తొలిదశ ఎన్నికల పోలింగ్ పూర్తవగా.. మరో రెండు రోజుల్లో రెండో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో దశకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలో నామినేషన్ వేసేందుకు జనం భయపడిపోతున్నారు. ఓడితే ఫర్వాలేదు. పొరబాటున గెలిస్తే చావాల్సిందేనని వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామంలో,500 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ కూడా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామంలో పంచాయతీకి పోటీ చేసే అభ్యర్థులతో పాటు వార్డుకు పోటీచేసే వారు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ 7వ వార్డుకు పోటీ చేసేందుకు మాత్రం గ్రామస్తులు ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం మృత్యు భయం వారిని వెంటాడుతోంది.

    అసలు స్టోరీ ఏంటంటే గత 25 ఏళ్లుగా ఏడో వార్డులో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మరణిస్తున్నారంట. ఇంతవరకు ఒక్కరు కూడా ఆ వార్డులో గెలిచిన వాళ్లు రెండో ఎన్నికలు చూడలేదట. దీంతో 7వ వార్డులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అసలు ఆ వార్డు పేరెత్తితేనే వణికిపోతున్నారు. దీంతో ఏకగ్రీవమైనా చేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ చేసి గెలిస్తేనే చస్తుంటే.. ఇక ఏకగ్రీవమైతే నిల్చున్న చోటే ప్రాణాలు పోతాయన్న చర్చ కూడా గ్రామంలో జరుగుతోందట.

    ప్రస్తుతం ఈ గ్రామం వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఆసక్తికర విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయి. ఒకే గ్రామం రెండు పంచాయతీలు, రెండు జిల్లాల పరిధిలో ఒకే గ్రామాలు ఉండటం, బంధువులు, అక్కాచెల్లెళ్లు, అత్తాకోడళ్లు పోటీపడటం లాంటి ఘటనలను ఈ ఎన్నికల్లో హైలెట్ అవుతున్నాయి. తాజాగా బుచ్చిపేట అంశం కూడా వింత కారణంతో వార్తల్లోకెక్కింది.
    Published by:Purna Chandra
    First published: