Home /News /politics /

VIJAYSAI REDDY COMMENTS ON JANASENA CHIEF PAWAN KALYAN SB

అడ్డంగా వంగిపోయారు... పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)

ప్రజలు వదుల్తారా? దుడ్డు కర్రలతో వెంటపడ్డారు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

    ఎన్నికల సందర్భంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య మాటల యుద్దం ముదురుతుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నిటారుగా నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగిపోయిందంటూ పవన్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచి పడ్డాడు అని ఆరోపించారు. పోలీసులాగా వ్యవహరించాల్సిన వాడు దొంగతో కలిసిపోయాడన్నారు. దోపిడి సొమ్ముకు కాపలా కుక్కలా మారిపోయారని మండిపడ్డారు. ప్రజలు వదుల్తారా? దుడ్డు కర్రలతో వెంటపడ్డారు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

    కృష్ణాజిల్లా కైకలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ జగన్‌పై విమర్శల దాడి చేశారు. జగన్ రాయలసీమను రక్తసీమగా మార్చారని.. తాము అధికారంలోకి వస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే కుదరదని జగన్‌ను హెచ్చరించారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డికి కూడా ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు పవన్. ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోనని.. తాట తీస్తానని హెచ్చరించారు. పత్రికలు, టీవీ చానెళ్లు ఉన్నాయని పిచ్చి వేషాలు వేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని.. అయినా రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ కుటుంబాలే రాజకీయం చేయాలా? అని ప్రశ్నించారు పవన్. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇవాళ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Janasena, Janasena party, Pawan kalyan, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు