అమరావతిలో మంత్రుల వ్యాపారం... మండిపడ్డ టీడీపీ ఎంపీ

విజయవాడలో వరద నీరు వాటర్ డ్రైన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు రూ. 80 కోట్ల దాకా డబ్బులు నిలిపివేశారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.

news18-telugu
Updated: July 15, 2020, 2:42 PM IST
అమరావతిలో మంత్రుల వ్యాపారం... మండిపడ్డ టీడీపీ ఎంపీ
విజయవాడ ఎంపీ కేశినేని నాని (ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ మంత్రులు రాజధానిలో అపార్ట్‌మెంట్ల వ్యాపారం, గుడిలో లింగాలని మింగడంలో చూపే శ్రద్ధ విజయవాడ అభివృద్ధిపై చూపాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ అభివృద్ధిని, సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. గత టిడిపి హయాంలో బెజవాడను అన్ని విధాలా అభివృద్ధిని చేశామన్న ఎంపీ కేశినేని... జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి విజయవాడ మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. చిన్నపాటి వర్షానికే బెజవాడ మునిగిపోతుందని తాను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చానని అన్నారు.

అయితే వరద నీరు వాటర్ డ్రైన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు రూ. 80 కోట్ల దాకా డబ్బులు నిలిపివేశారని మండిపడ్డారు. అ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎందుకు ఆపుతున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్, బొత్స కమిషన్ల కోసమే ఇలా చేస్తున్నారా ? అని నిలదీశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని ఆయన అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 15, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading