హోమ్ /వార్తలు /National రాజకీయం /

Chandrababuకు భారీ షాక్ -ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ గుడ్ బై! -BJPలో TDP పీపీ విలీనం!

Chandrababuకు భారీ షాక్ -ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ గుడ్ బై! -BJPలో TDP పీపీ విలీనం!

చంద్రబాబు ఫొటో తొలగించిన కేశినేని నాని

చంద్రబాబు ఫొటో తొలగించిన కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘట్టానికి తెరలేచింది. ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలోకి విలీనం కాబోతోందనే ప్రచారం జోరందుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఆఫీసులో చంద్రబాబు ఫొటోను తొలగంచడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం సైకిల్ దిగబోతున్నారనే వార్తలు తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతున్నాయి. పూర్తి వివరాలివి..

ఇంకా చదవండి ...

వరుస పరాజయాలతో డీలా పడ్డ తెలుగుదేశం పార్టీ (TDP)కి మరో భారీ ఎదురుదెబ్బ తగలనుందా? టీడీపీకి గుండెకాయ లాంటి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు పార్టీని వీడనున్నారా? ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావశీలురైన ఆ ఇద్దరు ఎంపీలు సైకిల్ దిగి కమలం గూటికి చేరనున్నారా? అంటే కచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన కొద్ది గంటలుగా విజయవాడలో చోటుచేసుకుంటోన్న పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు షాకింగ్ గా మారాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోగా, ఇప్పుడు లోక్ సభ ఎంపీల చేరిక ద్వారా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీ (BJP)లో విలీనం అయిందని ప్రకటించేలా తెరవెనుక మంత్రాంగం నడుస్తోన్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబును తొలగించిన నాని

సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ బాటలో టీడీపీకే చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారనే వార్త ఆదివారం నుంచి ట్రెండింగ్ లో నిలించింది. ఇప్పటికే నాని ఢిల్లీలోని బీజేపీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారని, చేరికకు ముహుర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది. ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చుతూ ఎంపీ కేశినేని తన ఆఫీసులో చంద్రబాబు ఫొటోను తొలగించేశారు. కేశినేని భవన్ పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ ఆనవాళ్లు అన్నిటినీ చెరిపేయడంతో బీజేపీలోకి నాని చేరిక ఖాయమని సర్వత్రా చర్చ జరుగుతున్నది.

ఇక ఢిల్లీలో దబిడి దిబిడే -మోదీ, జగన్‌కు బాలయ్య వార్నింగ్ -ఆ పని చేయకపోతే హర్యానా తరహా ఉద్యమం


సిలబస్ మార్చిన కేశినేని..

మొన్నటిదాకా కేశినేని ఆఫీసులో చంద్రబాబు, టీడీపీ నేతల బొమ్మలు కనిపించేవి. చంద్రబాబుతో కేశినేని నాని దిగిన ఫొటో ఫుల్ సైజులో ప్రధాన ఆకర్షణగా ఉండేది. అలాగే విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతల ఫొటోలు కూడా నాని ఆఫీసులో దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు వాటన్నిటినీ తొలగించేశారు. చంద్రబాబు స్థానంలో రతన్ టాటాతో నాని కలిసున్న ఫొటోను రీప్లేస్ చేశారు. టీడీపీ ముఖ్య నేతల ఫొటోలకు బదులుగా గత ఐదేళ్లలో నాని చేపట్టిన సేవా కార్యక్రమాల ఫొటోలను ఉంచారు. తద్వారా కేశినేని క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్లయింది.

నేను, వంశీ ఫోన్లు చేస్తే ఉమ ఎత్తట్లేదు -చాలా మంది టీడీపీ వాళ్లకు ఈ విషయం తెలీదు : kodali nani


గుంటూరు గల్లా జయదేవ్ కూడా?

విజయవాడ ఎంపీ కేశినేని నానితోపాటే గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా సైకిల్ దిగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గల్లా చేరికకు ఇతర కారణాలు కూడా వినిపిస్తున్నాయి. జయదేవ్ కుటుంబం నడిపిస్తోన్న అమరారాజా బ్యాటరీస్ సంస్త దేశంలోనే నంబర్ వన్ కాగా, ఇటీవల ఆ సంస్థను జగన్ సర్కారు టార్గెట్ చేసిన నేపథ్యంలో జగన్ ను మించిన పెద్దల అండ కోసమే జయదేవ్ బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు కామెంట్లు వస్తున్నాయి. ఈ ఇద్దరి చేరికతో..

Pawan Kalyan: ఎవరూ చేయలేని పనిని తలకెత్తుకున్న JanaSena -మాజీ సీఎం కోసం కోటి రూపాయలతో నిధి


టీడీపీ పార్లమెంటరీ పార్టీ విలీనం?

చంద్రబాబు సారధ్యంలోని టీడీపీకి ప్రస్తుతం ముగ్గురు లోక్ సభ ఎంపీలున్నారు. శీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ప్రాతినధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు నాని, జయదేవ్ లు బీజేపీలో చేరితే లెక్క ప్రకారం ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అవుతుందని, ఆ మేరకు ప్రకటన కూడా చేయించే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు ఫొటో తొలగింపు, బీజేపీలో చేరికపై వార్తలకు కేశినేని నాని ఇప్పటిదాకా స్పందించలేదు. గల్లా జయదేవ్ సైతం పార్టీ మార్పు ప్రచారంపై నోరుమెదపలేదు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Chandrababu Naidu, Jayadev Galla, Kesineni Nani, TDP

ఉత్తమ కథలు