అసలే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తెలుగుదేశం పార్టీని అంతర్గత పోరు కూడా వెంటాడుతోంది. ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించారు. కేశినేని నానిని లోక్సభలో విప్ పదవి ఇచ్చింది పార్టీ అధిష్టానం. అయితే, విజయవాడ ఎంపీ పదవే చాలని, పార్లమెంట్లో ఎలాంటి పదవులూ వద్దంటూ పార్టీ పెద్దలకు తేల్చి చెప్పేశారు. అయితే, కేశినేని నానిని బుజ్జగించేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రంగంలోకి దిగారు. నాని ఆఫీసుకు వెళ్లి చర్చించారు. పార్లమెంట్లో విప్ పదవి ఇస్తుంటే, తిరస్కరించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, పార్టీలో మొదట తనకు ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత తనను కరివేపాకులా తీసేయడం మీదే కేశినేని నాని అలిగినట్టు సమాచారం.
అసలే కృష్ణా జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంపిక,నిర్వహణ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించారు పార్టీ పెద్దలు. నాని కూడా ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యాలయం గురించి దేవినేని ఉమా ఫైనల్ చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. మొదట తనకు బాధ్యత అప్పగించి మళ్లీ ఇప్పుడు దేవినేనిని పగ్గాలు ఇవ్వడంపై నాని అలకబూనారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kesineni Nani, Tdp, Vijayawada