news18-telugu
Updated: October 31, 2019, 12:11 PM IST
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమంలో మంత్రులతో కలిసి పాల్గొన్న నాని...ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని ఆయన అభినందించారు. ఈ ప్రక్రియను సజావుగా చేపడితే... మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే... రాజకీయాలకు అతీతంగా అభినందిస్తానని అన్నారు.

ఎంపీ కేశినేని నాని(ఫైల్ ఫోటో)
ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం మంచి నిర్ణయమని నాని అన్నారు. తాను ఓ ప్రైవేట్ బస్సు ఆపరేటర్‌గా వ్యవహరించానని గుర్తు చేసిన ఎంపీ కేశినేని నాని... ప్రైవేట్ ఆపరేటర్లు లాభాలు వచ్చే మార్గాల్లో ప్రయివేట్ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రయివేట్ ఆపరేటర్లు బస్సులు నడపరని వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు. మంత్రి పేర్ని నాని తండ్రి గతంలో కార్మిక సంఘం నేతగా ఉన్నారని... ఆయన కుటుంబం కార్మిక పక్షపాతి నాని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 31, 2019, 12:11 PM IST