Vijayawada: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో..

కేశినేని నాని(ఫైల్ ఫొటో)

Vijayawada News: కృష్ణా జిల్లా నేతలు, విజయవాడ టీడీపీ నేతలతో సఖ్యత లేకుండా వ్యవహరిస్తున్న కేశినేని నాని వ్యవహారంపై టీడీపీ అధినాయకత్వం కూడా సంతృప్తిగా లేదని చాలాకాలం నుంచి వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    అసలే టీడీపీ కష్టాల్లో ఉంది. దీనికి తోడు ఆ పార్టీలోని కొందరు నేతలు అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. తమ పట్ల పార్టీ అధినాయకత్వం తీరు సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నాయకుల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకరు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ విజయవాడ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచే ఆయన టీడీపీ అధినాయకత్వంలో విభేదిస్తున్నట్టు కనిపించారు. కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నలతో కేశినేని నానికి మొదటి నుంచి పొసగడం లేదు. వీరిపై ఆయన బాహాటంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. మధ్యలో టీడీపీ అధినాయకత్వం కల్పించుకుని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చినట్టు కనిపించింది.

    విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కూతురే మేయర్ అభ్యర్థి అని ప్రకటించుకున్నారు. అయితే కొంతకాలంగా టీడీపీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారబోనని.. అలాగని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బుద్దా వెంకన్న, బొండా ఉమా తనపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం ఆయన అసంతృప్తికి అసలు కారణం.

    ఎంపీ కాళ్లు విరగ్గొడతాను అంటూ సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని నాని ఆవేదన చెందుతున్నారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీగా తన విధులు నిర్వహిస్తానని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన తన అనుచరులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని.. తన కూతురు కూడా ఏ ఎన్నికల్లో పోటీ చేయదని కేశినేని నాని చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది.

    Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?


    అయితే కృష్ణా జిల్లా నేతలు, విజయవాడ టీడీపీ నేతలతో సఖ్యత లేకుండా వ్యవహరిస్తున్న కేశినేని నాని వ్యవహారంపై టీడీపీ అధినాయకత్వం కూడా సంతృప్తిగా లేదని చాలాకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయనను పార్టీ నాయకత్వం అంతగా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని పార్టీకి దూరంగా ఉండాలని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: