చంద్రబాబుకు షాక్... జగన్‌కు జై కొట్టిన టీడీపీ ఎంపీ

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని... బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు.

news18-telugu
Updated: August 9, 2019, 7:07 PM IST
చంద్రబాబుకు షాక్... జగన్‌కు జై కొట్టిన టీడీపీ ఎంపీ
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
కొద్దివారాలుగా ఏపీలోని అధికార పార్టీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అనూహ్యంగా జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని సమర్ధిస్తూనే జగన్‌కు సలహాలిచ్చారు ఎంపీ కేశినేని నాని. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వానికో, వాన్‌పిక్‌కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వమే ఈ పోర్ట్ పనులను నిర్వహించేలా నిర్ణయం తీసుకుని తన చిత్తశుద్ధిని సీఎం జగన్ నిరూపించుకోవాలని కేశినేని నాని కోరారు.

Kesinani nani supports ap cm jagan,kesineni nani supports ysrcp,kesineni nani on bandar port,kesineni nani shock to chandrababu naidu,kesinani support jagan in bandar port issue,kesineni nani shocking decision,kesineni nani shocks tdp,kesineni nani joins ysrcp,kesineni nani joins bjp,Vijayawada mp kesineni nani,tdp mp kesineni nani,ఏపీ సీఎం జగన్‌కు జై కొట్టిన కేశినేని నాని,విజయవాడ ఎంపీ కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని (ఫైల్ ఫోటో)


అయితే కేశినేని నాని ఈ విషయంలో వైసీపీకి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కాంట్రాక్ట్‌ను మరో కంపెనీకి ఇవ్వకుండా... ముందుగానే ప్రభుత్వమే ఈ పనులు చేపట్టాలని ఆయన సూచించారని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంగానే గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్‌కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఆ సంస్థకు లీజుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు పరిహారం కూడా కోరే అవకాశాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు