Kesineni Swetha: విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత గురించి మీకు తెలుసా..?

కేశినేని శ్వేత (ఫైల్)

కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న శ్వేత (Kesineni Swetha).. గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనప్పుడే మేయర్ అబ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. ఇటీవలే శ్వేతను టీడీపీ అధినేత చంద్రబాబు ( TDP Chief Nara Chandrababu Naidu) మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరం విజయవాడ. కొత్త ప్రభుత్వం, రాజధాని తరలింపు నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పరేషన్ కు జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ మేయర్ పీఠం ఎవరదన్నదానిపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న శ్వేత.. గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనప్పుడే మేయర్ అబ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. ఇటీవలే శ్వేతను టీడీపీ అధినేత చంద్రబాబు మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం శ్వేత ప్రొఫైల్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

    శ్వేత పూర్తిపేది కేశినేని శ్వేతా చౌదరి.. వయసు 25 ఏల్లు, తండ్రి కేశినేని శ్రీనివాస్, తల్లి పావని, సోదరి హైమా.. శ్వేత విద్యార్హతలను పరిశీలిస్తే.. విజయవాడలోని అట్కిన్ సన్ స్కూల్, వీపీ సిద్ధార్ధ, ఊటీలోని లారెన్స్ స్కూల్లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. బెంగళూరులోని ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అమెరికా అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సీలో బీఏ ఎకనామిక్స్, బీఏ సైకాలజీ చదివారు.

    Telugu Desham Party, Kesinen Swetha, Vijayawada Municipal Corporation, Municipal elections, AP Munincipal Elections, Andhra Pradesh Municipal Elections, Andhra Pradesh News, Vijayawada News, AP news, Telugu news, Kesineni Nani, Vijayawada, తెలుగుదేశం పార్టీ, కేశినేని శ్వేత, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు, ఏపీ మున్సిపల్ ఎన్నికుల, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, విజయవాడ న్యూస్, తెలుగు న్యూస్, కేశినేని నాని, విజయవాడ
    కేశినేని శ్వేత (పైల్)


    ఆఫ్రికా దేశమైన ఘనాలో మైక్రో ఫైనాన్స్ కమ్యూనిటీ సర్వీసెస్ ప్రాజెక్టులో పనిచేశారు. అలాగే ఐర్లాండ్ లో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రామ్ లో పనిచేశారు. అలాగే టాటా ట్రస్ట్ రూరల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో పనిచేశారు. అలాగే టాటా ట్రస్ట్ క్యాన్సర్ కేర్ ప్రోగ్లామ్ లో భాగంగా అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, రాజస్ధాన్‌ రాష్ట్రాల్లో పనిచేశారు.

    Telugu Desham Party, Kesinen Swetha, Vijayawada Municipal Corporation, Municipal elections, AP Munincipal Elections, Andhra Pradesh Municipal Elections, Andhra Pradesh News, Vijayawada News, AP news, Telugu news, Kesineni Nani, Vijayawada, తెలుగుదేశం పార్టీ, కేశినేని శ్వేత, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు, ఏపీ మున్సిపల్ ఎన్నికుల, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, విజయవాడ న్యూస్, తెలుగు న్యూస్, కేశినేని నాని, విజయవాడ
    కేశినేని శ్వేత


    కేశినేని శ్వేత రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2014 అమెరికాలోని అట్లాంటా సెనేటర్‌ ఎన్నికలలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థి హిల్లరి క్లింటన్‌ తరపున ప్రచారం నిర్వహించారు.

    Telugu Desham Party, Kesinen Swetha, Vijayawada Municipal Corporation, Municipal elections, AP Munincipal Elections, Andhra Pradesh Municipal Elections, Andhra Pradesh News, Vijayawada News, AP news, Telugu news, Kesineni Nani, Vijayawada, తెలుగుదేశం పార్టీ, కేశినేని శ్వేత, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు, ఏపీ మున్సిపల్ ఎన్నికుల, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, విజయవాడ న్యూస్, తెలుగు న్యూస్, కేశినేని నాని, విజయవాడ
    హిల్లరీ క్లింటన్ తో కేశినేని శ్వేత


    2014-2019 ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని టిడిపి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార భాద్యతలు నిర్వహించారు.
    Published by:Purna Chandra
    First published: