Home /News /politics /

Jr.NTR Political Entry: ఆ పార్టీకి ఆయ‌నే దిక్కా..? జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ఎందుకంత ఫోకస్.?

Jr.NTR Political Entry: ఆ పార్టీకి ఆయ‌నే దిక్కా..? జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ఎందుకంత ఫోకస్.?

చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ (ఫైల్)

చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో.. అందునా తెలుగుదేశం పార్టీ (Telugu Desham party)లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) గురించే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (RRR Movie)తో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ పాలిటిక్స్ వైపు చూస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
  విష‌యం ఎదైన కావ‌చ్చు... సంద‌ర్భం ఎదైన కావ‌చ్చు తెలుగుదేశం పార్టీలో (Telugu Desham Party) గ‌త కొద్దిరోజులుగా ఒక‌టే చ‌ర్చ హోరెత్తిస్తోంది. అదే జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ (Jr.NTR Political Entry). గ‌త కొద్ది రోజులుగా పార్టీలో కీల‌క నేత‌ల మ‌ధ్య కాకుండా టీడీపీ సానుభూతిప‌రుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పై జోరుగా చర్చ న‌డుస్తోంది. అయితే తాజా టీడీపీ ఆవిర్భా‌వ దినోత్సం సంద‌ర్బంలో పార్టీలో కీల‌క నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు మ‌ళ్లీ జూనీయ‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ పై చ‌ర్చ‌కు తెర‌తీశాయి. ఈ వేడుక‌ల్లో కీల‌క నేత‌ల‌ను క‌లిసిన  కార్యకర్తలు పార్టీ మ‌ళ్లీ పుంజుకోవ‌డానికి ఏం చేయాల‌న్న దానిపై ప‌లు ప్ర‌తిపాద‌న‌లను నేతల ముందు ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానం పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హారించే బుచ్చ‌య్య చౌద‌రి చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు కీల‌కంగా మారాయ‌నే చెప్పుకోవాలి. గ‌త కొద్ది రోజులుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాల‌ని జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఈ వ్యాఖ్య‌లు ఆజ్యం పోసిన‌ట్లు చేశాయి. త్వ‌ర‌లో పార్టీలో కీల‌క మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయి.

  పార్టీలోకి కొత్త నాయ‌క‌త్వం రాబోతుంద‌ని జూనీయ‌ర్ ఎన్టీఆర్ కూడా పార్టీలోకి రాబోతున్నార‌ని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు కాస్త ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు తన త‌న‌యుడు లోకేష్ ను త‌న త‌రువాత నాయుకుడిగా ప్రొజెక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌క‌పోవ‌డం వ‌ల‌నే ఇప్పుడు జూనీయ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్త‌వ‌న పార్టీలో ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే జూనీయ‌ర్ ఎన్టీఆర్ మాత్రం త‌న‌పై ఎన్నిసార్లు చ‌ర్చ జ‌రిగినా వాటిని సున్నితంగానే తిర‌ష్క‌రిస్తున్నారు.

  ఇది కూడా చదవండి: ముగిసిన నిమ్మగడ్డ పదవీ కాలం.. ఆ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధం..


  మొన్న‌టికి మొన్న ఎవ‌రు మీరో కోటీశ్వ‌రుడు అనే ప్రోగ్రామ్ కు సంబంధించి మీడియా స‌మావేశంలో కూడా విలేక‌ర్లు అడిగిన ప్రశ్న‌ల‌ను దాట‌వేశారు జూనియర్. త‌రువాత ఒక సినిమా ఆడియో పంక్ష‌న్ లోకూడా అభిమానులు సీఏం సీఎం అనే నినాధాలు చెసిన‌ప్పుడు కూడా వారిని వారించారు. వీటి నేప‌థ్యంలో అసలు జూనియ‌ర్ రాముడుకి పాలిటిక్స్ అంటే ఇంట్ర‌స్ట్ ఉందా లేదా అనే అంశంపై చ‌ర్చ ఆయ‌న స‌న్నిహితుల్లో జోరుగా జ‌రుగుతుంది. అయితే ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయాల్లోకి జూనియ‌ర్ రాక‌పోయిన‌ప్ప‌టికి భ‌విష్య‌త్ లో మాత్రం వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

  ఇది చదవండి: ఏపీ ప్రజలకు చల్లనికబురు.. నాలుగు రోజుల పాటు వర్షసూచన..


  ప్ర‌స్తుతం టీడీపీలోకి నాయ‌క‌త్వ లోపం  అనే అంశంపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత  ఈ చర్చ మరింత ఊపందుకుంది.  చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ లాంటి వాళ్లు ఉన్న‌ప్పుడు ఇక ఎన్టీఆర్ అవ‌స‌రం ఏముంటుంద‌నేది అనేది కూడా ఒక ప్ర‌శ్ర‌గా ను ఉంది. ఎన్టీఆర్ పార్టీలో ఒక కీల‌క నేత‌గా ఆవిర్భవించ‌గ‌ల‌గుతాడా లేదా అనేదాని కంటే ఎన్టీఆర్ అవ‌స‌రం పార్టీకిచాలా ఉంటుంద‌నేది మాట మాత్రం వాస్తవమని న్యూస్ 18కి తెలిపారు ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు శ్రీనివాస్.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Jr ntr, Tdp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు