చంద్రబాబు ధర్నా ఎఫెక్ట్... ఫంక్షన్ హాల్‌కు పోలీసుల నోటీసులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధర్నా చేస్తే.. ఆ ఎఫెక్ట్ ఫంక్షన్ హాల్ మీద పడింది. విజయవాడలోని వేదిక ఫంక్షన్ హాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

news18-telugu
Updated: January 9, 2020, 6:48 PM IST
చంద్రబాబు ధర్నా ఎఫెక్ట్... ఫంక్షన్ హాల్‌కు పోలీసుల నోటీసులు
చంద్రబాబు ధర్నా, వేదిక ఫంక్షన్ హాల్‌కు పోలీసుల నోటీసులు
  • Share this:
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధర్నా చేస్తే.. ఆ ఎఫెక్ట్ ఫంక్షన్ హాల్ మీద పడింది. విజయవాడలోని వేదిక ఫంక్షన్ హాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెళ్లిళ్లకు ఇవ్వాల్సిన ఫంక్షన్ హాల్‌ను నిరసన కార్యక్రమాలకు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు పటమట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేరుతో ‘వేదిక’ ఫంక్షన్ హాల్‌కు నోటీసులు వెళ్లాయి. విజయవాడ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలో ఎలాంటి సమ్మెలు, ర్యాలీలు, ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడటాలు నిషేధంలో ఉన్నాయని పోలీసులు తెలిపారు.

వేదిక ఫంక్షన్ హాల్ యజమాని చెన్నుపాటి వజీర్‌కు పోలీసులు నోటీసులు


అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో అమరావతి జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. టీడీపీ, వామపక్షాలు, జనసేన, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బస్సులను పోలీసులు సీజ్ చేసిిన ప్రాంతానికి పాదయాత్రగా బయలుదేరారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకిి తీసుకుని అనంతరం వారిని చంద్రబాబు నివాసం వద్ద వదిలిపెట్టారు.ఈ ఘటనకు సంబంధించి అసలు అమరావతి పరిరక్షణ సమితికి ఫంక్షన్ హాల్ ఇచ్చినందుకు చెన్నుపాటి వజీర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 9, 2020, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading