విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

మారుతినగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఫోన్ సంభాషణ తో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: December 4, 2019, 2:20 PM IST
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు.  నిందితుల నుంచి 16లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన పైలా ప్రసాద్,మోహన్ కృష్ణ, శరత్ చంద్రతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మోహన్ కృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు.  నిందితుల నుంచి బెట్టింగ్ కు నిర్వహించే 20 సెల్ ఫోన్స్ బాక్స్, వీడియో కాన్ టీవీ, 2 ల్యాప్ట్యాప్ లు, 19 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌లో ప్రధాన నిందితుడు ప్రసాద్ కేవలం 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. టెక్నాలజీ సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్నారు. మారుతినగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఫోన్ సంభాషణ తో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్ కాన్ఫరెన్స్ తో  క్రికెట్ బెట్టింగ్ లు జరుగుతున్నాయని తెలిపారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...