Raghu Ramakrishnam Raju: సీఎం జగన్ నుంచి ప్రాణహాని ఉంది.. ప్రధానికి రాజుగారి లేఖ

ఎంపీ రఘరామ కృష్ణంరాజు, సీఎం జగన్(ఫైల్ ఫొటో)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Ragu Ramakrishnam Raju) మరో సంచలనానికి తెరలేపారు. సీఎం జగన్ (AP CM YS Jagan)పై తీవ్ర ఆరోపణలు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో సంచలనానికి తెరలేపారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. తాజాగా మరోషాకిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖరాశారు. తాను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేశానని.. అప్పటి నుంచి తనకు అసభ్యకర ఫోన్ కాల్ వస్తున్నాయని.. కొంతమంది చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఐతే తాను ఇలాంటి ఫోన్ కాల్స్ కు భయపడనని.. కానీ సీఎం జగన్ కు ఉన్న క్రిమినల్ చరిత్ర దృష్ట్యా ప్రాణభయం ఉందని రాశారు. కొన్నివారాల క్రితం తనపై ఆంధ్రప్రదేశ్ లో తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఇప్పుడు తనను భౌతికంగా తప్పించేందుకు కుట్ర చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారముందని రాశారు.

    ఈ విషయంలో సీఎం జగన్ పై కొన్ని ఆరోపణలు కూడా చేశారు రఘురామ కృష్ణం రాజు. ముఖ్యంగా సీఎం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో తన పాత పరిచయాలను ఉపేయింగించి ప్రొఫెషనల్ కిల్లర్స్ తో తనను చంపేందుకు యత్నిస్తున్నట్లు రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. ప్రస్తుతం తనకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నారని.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీలోనూ భద్రత పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. నిత్యం తనతో గన్ మెన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

    MP Ragurama Krishnam Raju, YSRCP MP Ragurama Krishnam Raju, Raghurama Krishnam Raju comments on YS Jagan, Raghurama Krishnam Raju News, YS Jagan CBI Cases, CBI Cases against AP CM YS Jagan, CBI Charge sheets on YS Jagan, Andhra Pradesh CM YS Jaganmohan Reddy, AP CM Jagan, Hyderabad CBI Court, CBI Investigation, YS Vivekananda Reddy Murder Case, YCP MP Vijayasai Reddy, Andhra Pradesh news, Andhra News, AP news, Telugu news, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైఎస్ జగన్ పై రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు, రఘురామ కృష్ణంరాజు వార్తలు, జగన్ పై సీబీఐ కేసులు, ఏఫీ సీఎం వైఎస్ జగన్ పై సీబీఐ కేసులు, వైఎస్ జగన్ పై సీబీఐ ఛార్జిషీట్లు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, హైదరాబాద్ సీబీఐ కోర్టు, సీబీఐ దర్యాప్తు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేకు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, MP Raghu Rama Krishnam Raju Made Allegations on YS Jagan, YS Jaganmohan Reddy, వైఎస్ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ఆరోపణలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, Prime Minster Narendra Modi, Raghu Ramakrishnam raju letter to PM Modi, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ
    ప్రధానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

    ఇది చదవండి: ఎన్నికల వేళ వైసీపీకి కొత్త టెన్షన్... పార్టీ గుర్తింపు రద్దుపై సస్పెన్స్.. షాక్ తప్పదా..?


    రఘురామ కృష్ణం రాజు తాజా లేఖతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇన్నాళ్లూ రాజధాని రచ్చబండ పేరుతో సీఎం జగన్ పై, ప్రభుత్వంపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించిన రఘురామ కృష్ణంరాజు.. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేడయం, ఇప్పుడు తనకు రక్షణ కల్పించాలంటూ ప్రధానికే లేఖ రాయడం సంచలనంగా మారింది. ఐతే లేఖపై ప్రధాని ఏ విధంగా స్పందిస్తారన్నది పక్కనబెడితే వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రఘురామకృష్ణం రాజుపై మండిపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.. తాజా లేఖతో మరింత ఆగ్రహానికి గురయ్యే అవకాశముంది. అలాగే సీఎం జగన్ పై చేసిన ఆరోపణలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published: