Telugu Desham party: పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారా..? సీనియర్ల అసంతృప్తికి అర్ధం అదేనా..?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Local Body Elections: పరిషత్ ఎన్నికలు టీడీపీలో (Telugu Desham Party) చిచ్చుపెడుతున్నాయి. చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించారంటూ సీనియర్లు మండిపడుతున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిషత్ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో  (Telugu Desham Party) చిచ్చు పెడుతున్నాయి. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన కొన్ని గంటలకే టీడీపీ కి ఉహించని షాక్ లు తగులుతున్నాయి. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలోని సీనియర్లు గుస్సా అవుతున్నారు. నిరసనగా పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రు రాజీనామా చేశారు. బాబు నిర్ణయం నిరాశకు గురి చేసిందని ఆయన కామెంట్ చేశారు. ఇదే విధంగా మరో సీనియర్ నేతఅశోక గజపతిరాజు బాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందన్నారు. తాను పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరవడం కాదని.. జూమ్ మీటింగ్ లో జాయిన్ కాలేదు అంతే అన్నారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ అని గుర్తు చేశారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవన్న అశోక్ గజపతి రాజు.. పోటీలో గెలిచినా, గెలవక పోయినా సిద్ధాంతాలు మాత్రం విడవకూడదన్నారు.

  విశాఖలోనూ తాము పోటీలో ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రకటించారు. స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోని పోటీ చేస్తామన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం అటు పార్టీలోను ఇటు ప్రజల్లోనూహట్ టాపిక్ గా మారింది. అసలు పరిషత్ బాయ్ కాట్ కారణం ఏమిటి అన్నా దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎస్‌ఈసీ తీరును తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఇది చంద్రబాబు బాబు తొందర పాటు చర్య అని పార్టీలోని ఓ వర్గం ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజలకు పార్టీ దూరమైయ్యే పరిస్థితి వస్తోందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: ఏడుకొండలపై మరో వివాదం...? టీటీడీ నిర్ణయంతో కొత్త తలనొప్పులు తప్పవా..?


  పార్టీకి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడే వారి ఆదరణ ఉందనేది టీడీపీ సీనియర్ల అభిప్రాయం. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసు కోక పోవడం వల్లే ఈ నిర్ణయానికి కారణమని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని చెప్పిన తర్వాత కూడా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో టీడీపీ నేతలు పోటీ చేస్తామని చెప్పడం అనే నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నాను అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కె అన్నారు. లోకేష్ ఆదేశాలు లేకుండానే స్థానిక నేతలు పోటీ నిర్ణయం ఎలా తీసుకుంటారనేది ఆర్కే వేస్తున్న ప్రశ్న.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు నిరాశ... కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ


  సీనియర్ల నిర్ణయాలతో పార్టీలో చంద్రబాబుపై వ్యతిరేకత చాలానే ఉందని మరోసారి తేటతెల్లమవుతోంది. దీన్ని బట్టి చూస్తే పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని కార్యకర్తలు నాయకులూ కోరుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు మాజీ ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కొంత ప్రయత్నం చేసినా వైసీపీని నిలువరించలేకపోయారని.. కొత్త కమిషనర్‌ ఆ మాత్రం ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేనప్పుడు పోటీ చేసి ప్రయోజనమేంటని మరికొంతమంది నేతలంటున్నారు.
  Published by:Purna Chandra
  First published: