ఎంఐఎం సభలో టీడీపీ ఎంపీ.. ప్రధాని మోదీ, అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)తో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కుల మత ప్రాంతాల వారిగా విభజించే హక్కు ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: February 18, 2020, 10:31 PM IST
ఎంఐఎం సభలో టీడీపీ ఎంపీ.. ప్రధాని మోదీ, అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు
అసదుద్దీన్ ఓవైసీ, కేశినేని నాని
  • Share this:
కేంద్ర ప్రభుత్వంపై విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)తో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కుల మత ప్రాంతాల వారిగా విభజించే హక్కు ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ది కోసం దేశ ప్రజల ఐక్యతని దెబ్బతీస్తున్నారని.. బీజేపీ పాలనలో మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు టీడీపీ ఎంపీ. విజయవాడలో CAA, NRCకి వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''ఆనాడు షేక్ అబ్దుల్లా లేకపోతే నేడు కాశ్మీర్ పాకిస్థాన్‌లో ఉండేది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆర్టికల్ 370ని తీసుకువచ్చారు. దేశంలో పార్లమెంటేరియన్ అంటే ఎలా ఉండాలో అసదుద్దీన్ ఓవైసీ చూపించారు. మన పౌరసత్వంని మనం రుజువు చేసుకోవాల్సి వస్తుందంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. NRC, CAA వల్ల పేద మధ్య తరగతి వాళ్ళు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ 22 మంది ఎంపీలు ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేశారు. మా పార్టీలో ఇద్దరు ఎంపీలు కూడా అనుకూలంగా ఓటు వేసినా.. నేను ఓటు వేయకుండా బయటికి వచ్చా. NRC, CAAకి వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ తీర్మానం పెట్టాలి. దానికి టీడీపీ ఎమ్మెల్యేలు దానికి మద్దతు తెలుపుతారు.'' అని కేశినేని నాని అన్నారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు