సీఎం జగన్‌కు విజయవాడ ఎంపీ కేశినేని నాని సూచన...

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఓ సూచన చేశారు.

news18-telugu
Updated: May 8, 2020, 1:07 PM IST
సీఎం జగన్‌కు విజయవాడ ఎంపీ కేశినేని నాని సూచన...
విజయవాడ ఎంపీ కేశినేని నాని (ఫైల్ ఫోటో)
  • Share this:
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఓ సూచన చేశారు. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో గోదావరి నది బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కూడా కోటి రూపాయలు ఇచ్చి వుంటే బాగుండేదని ఎంపీ కేశినాని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఆ కుటుంబాలకు బ్యాలన్స్ అమౌంట్ ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలని... అలా కాకుండా ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండకూడదని కేశినేని నాని అన్నారు.

అంతకుముందు విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజీనామా చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిశ్రమల శాఖ అధికారుల మీదే కాకుండా, సంబంధిత మంత్రి మీద కూడా కేసులు నమోదు చేయాలని, అలాగే, మంత్రి రాజీనామా చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: May 8, 2020, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading