ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన విజయవాడ దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన కేశినేని నాని ట్వీట్ చేశారు. ‘మీరు ముఖ్యమంత్రి అవ్వటానికి, మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని (ఏబీ వెంకటేశ్వరరావు) సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
మీరు @ysjagan ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ @YSRCParty అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ @JaiTDP ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!! pic.twitter.com/mydh04pkVA
— Kesineni Nani (@kesineni_nani) February 9, 2020
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఏప్రిల్‌లో జరిగి నఅసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మీద వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన్ను బదిలీ చేసింది. తాజాగా అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం ఆరోపణలతో సస్పెండ్ చేసింది.
వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు ప్రభుత్వం చెప్పిన కారణాలు..
ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. అక్రమాల కారణంగా నాపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తాన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు.దీనిపై ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.