ఏపీ సీఎం జగన్‌ అమ్మఒడి పథకాన్ని ప్రశంసించిన టీడీపీ ఎంపీ

నేను ఎవరిని పొగడటం లేదమ్మా.. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు. నేను ఎవరినీ పొగడటం లేదు’ అని కేశినేని నాని స్పష్టం చేయడం విశేషం.

news18-telugu
Updated: September 7, 2019, 3:39 PM IST
ఏపీ సీఎం జగన్‌ అమ్మఒడి పథకాన్ని ప్రశంసించిన టీడీపీ ఎంపీ
పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: September 7, 2019, 3:39 PM IST
నిత్యం ఏదో ఓ వార్తలతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉండే టీడీపీ ఎంపీ కేశినేని నాటి తన రూటు మార్చారు. ఎప్పుడూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే కేశినాని.. తాజాగా తన స్టైల్ మార్చారు. ఈసారి ఏకంగా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకమని కొనియాడురు. ఈ పథకం విధివిధానాలు సరిగ్గా ఉంటే ప్రతీ తల్లికి సంవత్సరానికి రూ.15,000 అందుతాయన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే దేవాలయాలనీ, ఆ స్కూళ్లే ఎంతో మంది మేధావులను దేశానికి అందించాయని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ విద్యాబోధన పెరగాల్సిన అవసరం ఉందన్నారు కేశినేని. ఈ సందర్భంగా ‘నేను ఎవరిని పొగడటం లేదమ్మా.. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు. నేను ఎవరినీ పొగడటం లేదు’ అని కేశినేని నాని స్పష్టం చేయడం విశేషం.

గతంలో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం జోరున రూ. 15 వేల రూపాయల సాయం అందించనున్నారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలతో పాటు.. ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తింపచేస్తారని ప్రభుత్వ ప్రకటించింది.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...