విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓసారి సొంత పార్టీ నేతలపై... మరోసారి అధికార పార్టీపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కేశశినేని చేసే పోస్టులలో చంద్రబాబుని తిడుతున్నారా లేకా పార్టీని విమర్శిస్తున్నారా అనేదే చంద్రబాబును సైతం ఆలోచించేలా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ ఓడిపోయినందుకు ఇతను వైసీపీలో చేరడానికి ఆలా పోస్ట్ చేస్తున్నాడు ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ ఒకానొక సమయంలో నేను పార్టీ మారాను అని తేల్చి చెప్పడంతో తెలుగు తమ్ములు కొంచం ఉపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా ట్విట్టర్ లో సరికొత్త ట్విట్ పెట్టి మరోసారి టీడీపీ నేతలంతా షాక్ అయ్యేలా చేశారు.
కేశినేని నాని, దేవినేని ఉమా
''నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, Tweet చేస్తున్నాడు. దౌర్భాగ్యం!'' అంటూ ట్విట్ పెట్టారు కేశినేని నాని. ప్రతిపక్షాన్ని అంటున్నట్టు ఉన్న ట్విట్టేష్ బాబు నారా లోకేష్ గురించే ఈ ట్విట్ పెట్టినట్టు అనిపిస్తుంది. అది చదివితే మీరు కూడా ఇదే మాట అంటారు.దీంతో ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు ఈ ట్విట్ పక్క 'ట్విట్టర్ పిట్టా నారా లోకేష్'కే అంకితం ఇచ్చారు అని సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే కేశినేని .. బుద్ధావెంకన్న టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు చర్చించుకుంటున్నారు. మరి కేశినేని ఈ ట్వీట్ ద్వారా టార్గెట్ చేసినదెవరో మరి వేచి చూడాలి.
నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు
నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు.
నాలుగు పదాలు చదవలేనివాడు
నాలుగు వాక్యాలు రాయలేనివాడు
Tweet చేస్తున్నాడు.
దౌర్భాగ్యం!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.