చంద్రబాబుకు మళ్లీ మొదలైన ‘కేశినేని’ తలనొప్పి...

news18-telugu
Updated: February 22, 2020, 10:03 AM IST
చంద్రబాబుకు మళ్లీ మొదలైన ‘కేశినేని’ తలనొప్పి...
సీఎం జగన్‌కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువని చంద్రబాబు ధ్వజమెత్తారు..మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటడం లేదని అన్నారు. నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదని అన్నారు. ఫిరాయింపులపై గతంలో అసెంబ్లీలో ఏం చెప్పారని.. ఇప్పుడేం చేస్తున్నారు అనేదానిపై ప్రజలే చర్చిస్తున్నారని అన్నారు.
  • Share this:
ఏపీలో అసలు ఇబ్బందిపడుతున్న టీడీపీకి ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన కొత్తలోనూ పార్టీకి దూరమైనట్టుగా వ్యవహరించారు ఎంపీ కేశినేని నాని. సొంత పార్టీ నేతలపైనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఒకదశలో ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ మళ్లీ పార్టీ లైన్‌లోకి వచ్చిన ఎంపీ కేశినేని నాని... అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో పార్టీ అదేశాలకు తగ్గట్టుగా వ్యవహరించారు. అయితే మళ్లీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... మరోసారి విజయవాడ ఎంపీ రూటు మార్చడం టీడీపీకి కొత్త తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది.

కొద్దిరోజుల క్రితం ఏపీ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంలో టీడీపీ వాదనకు భిన్నమైన వాయిస్ వినిపించారు ఎంపీ కేశినేని. టీడీపీ నేతలు ఏబీ వెంకటేశ్వరరావును వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినా... ఆయన మాత్రం ఈ విషయంలో భిన్నంగానే వ్యవహరించారు. తన వాదన సరికాదన్న టీడీపీ నేతల తీరును కూడా తప్పుబట్టారు.

ఇక తాజాగా ఎన్నార్సీని వ్యతిరేకించే విషయంలో టీడీపీ మద్దతు ఇస్తుందని... అలా జరగకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నార్సీ విషయంలో కేశినేని నాని వ్యాఖ్యల్లో తప్పేమీ లేకపోయినా... ఆయన పార్టీకి రాజీనామా చేస్తాననే కామెంట్స్ చేసి ఉండాల్సింది కాదని కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్‌గా మారినట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: February 22, 2020, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading