• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • VIJAYAWADA MP KESINENI NANI FIRES ON YS JAGAN OVER AP CAPITAL BS

నీ తాత వల్ల కూడా కాదు.. జగన్‌పై విజయవాడ ఎంపీ ఘాటు కామెంట్స్..

నీ తాత వల్ల కూడా కాదు.. జగన్‌పై విజయవాడ ఎంపీ ఘాటు కామెంట్స్..

సీఎం జగన్, కేశినేని నాని

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కూడా వీలు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

 • Share this:
  ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేశినేని మాట్లాడుతూ.. రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కూడా వీలు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదని, అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని మాయ మాటలు చెబితే.. నమ్మి ప్రజలు ఓట్లేశారని, తప్పుచేస్తే ఇక్కడి మహిళలు చీపురుకట్టలతో తరిమి కొడతారని అన్నారు. జగన్‌ను గెలిపించి తప్పు చేశామని, చంద్రబాబు కట్టాడనే ప్రజా‌వేదిక కూల్చివేయించాడని ఆరోపించారు. అశుభంతో జగన్ పాలన ప్రారంభించారని నాని అన్నారు.

  వాస్తవానికి, ఆదాయ మార్గాలే తప్ప విశాఖపై జగన్‌కు ప్రేమ లేదని, మళ్లీ ఎన్నికలకు వెళితే వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తరిమి కొడతారని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా జగన్‌కు పాలన చేతకాలేదని ఎద్దేవా చేశారు. ‘మీకు 22 మంది ఎంపీలు ఉన్నా మేం ముగ్గురం చాలు’ అంటూ జగన్‌కు సవాల్ విసిరారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు