జగన్ సర్కార్ అలా చేయాల్సిందే... విజయవాడ ఎంపీ డిమాండ్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.

news18-telugu
Updated: April 8, 2020, 1:54 PM IST
జగన్ సర్కార్ అలా చేయాల్సిందే... విజయవాడ ఎంపీ డిమాండ్
విజయవాడ ఎంపీ కేశినేని నాని
  • Share this:
కరోనా వైరస్‌ను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. పారాసిటమల్, బ్లీచింగ్ అనే మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని ఆయన అన్నారు. పేద, మధ్య తరగతి వారిని తక్షణమే ఆదుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలలో 5000 రూపాయలను జమ చేయాలని ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోనేరు పెదబాబు ఆధ్వర్యంలో లక్ష కోడిగుడ్ల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమాన్ని ఎనికేపాడులో ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. కరోనాని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో టీడీపీ ఎప్పుడూ ముందే ఉంటుందన్న ఎంపీ నాని... ప్రతి ఒక్కరూ పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగంలోని వారు, డ్రైవర్లు మరియు అసంఘటిత రంగంల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని... ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం త్వరగా బయట పడాలని ఎంపీ నాని కోరుకున్నారు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading