తలసాని కామెంట్స్ ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రిపై ఇకమీదట నో పాలిటిక్స్

విజయవాడ కనకదుర్మమ్మ (File)

రాజకీయ నాయకులకు మైకులు కనిపిస్తే చాలు.. చుట్టూ పరిసరాలను, వచ్చిన సందర్భాన్నీ మరిచిపోయి మాట్లాడేస్తుంటారు. ఇటీవల ఇంద్రకీలాద్రి కొండపై తెలంగాణ నేత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇలాంటి పునరావృతం కాకుండా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

 • Share this:
  రాజకీయ నాయకులకు మైకులు కనిపిస్తే చాలు.. చుట్టూ పరిసరాలను, వచ్చిన సందర్భాన్నీ మరిచిపోయి మాట్లాడేస్తుంటారు. ఇటీవల ఇంద్రకీలాద్రి కొండపై తెలంగాణ నేత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇలాంటి పునరావృతం కాకుండా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల జరిపిన ఏపీ పర్యటన పెద్ద దుమారమే రేపింది. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడి రగులుకుంది. తన పర్యటనలో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏపీ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అణగారిన వర్గాలకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శలు గుప్పించారు. తలసాని పర్యటనకు సైతం మంచి స్పందన రావడం, యాదవ సామాజికవర్గం నుంచి అనూహ్య స్వాగతం లభించడం... రెండు రాష్ట్రాల మధ్య మరింత రాజకీయ మంటలను రేపింది. నేతలు పరస్పరం విమర్శల వాన కురిపించుకున్నారు.

  talasani in Vijayawada, talasani srinivas yadav, talasani comments on chandrababu, Vijayawada durga temple board, kcr return gift, విజయవాడలో తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబుపై తలసాని ఫైర్, విజయ దుర్గమ్మ గుడి, ఇంద్రకీలాద్రి, విజయవాడ దుర్గగుడి కమిటీ, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్
  తలసాని శ్రీనివాస్ యాదవ్


  తలసాని శ్రీనివాస్ యాదవ్... కనకదుర్గమ్మ దర్శనం కోసం విజయవాడకు వెళ్లారు. అయితే, అమ్మవారి దర్శన అనంతరం ఇంద్రకీలాద్రిపై మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాలు ప్రస్తావించడం విమర్శలు దారి తీసింది. దైవదర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. ఏపీ టీడీపీ నేతలు సైతం ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కనకదుర్గ ఆలయ పాలకమండలి. ఇకపై దుర్గగుడికి వచ్చే భక్తులెవ్వరూ రాజకీయాలు మాట్లాడరాదని తీర్మానం చేసింది. భక్తుల మనోభావాలను ప్రతిఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఈఓ కోటేశ్వరమ్మ అన్నారు. కొండపై రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. పాలకమండలి నిర్ణయం నేపథ్యంలో.. మున్ముందు నాయకులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.

  ఇది కూడా చూడండి:

  First published: