Home /News /politics /

VIJAYAWADA ANDHRA PRADESH STATE ELECTION COMMISSION PLANNING TO CONDUCT MPTC ZPTC ELECTIONS SOON AND NEW SEC NEELAM SAWHNEY TO CONDUCT VIDEO CONFERENCE FULL DETAILS HERE PRN

MPTC, ZPTC Elections: రంగంలోకి దిగిన కొత్త ఎస్ఈసీ.. పరిషత్ ఎన్నికలపై కసరత్తు..

గవర్నర్ తో భేటీ అయిన ఎస్ఈసీ నీలం సాహ్నీ

గవర్నర్ తో భేటీ అయిన ఎస్ఈసీ నీలం సాహ్నీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీ (Neelam Sawhney) ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగారాకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎస్ఈసీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే రంగంలోకి దిగిన నీలం సాహ్నీ.. ఎన్నికల కమిషనర్ సెక్రటరీ కన్నబాబుతో పాటు ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిసల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మరోవైపు బాధ్యతలు తీసుకున్న వెంటనే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ఆయిన నీసం సాహ్నీ.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అందుకు సిద్ధమని వివరించినట్లు సమాచారం. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్.. ఎస్ఈసీతో భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై సీఎం ఆలోచనలు, అభిప్రాయాలను సీఎస్.. ఎస్ఈసీకి వివరించినట్లు తెలుస్తోంది.

    ఐతే ఎన్నికల నిర్వహణలో న్యాయపరమైన చిక్కులుండటంతో వాటిని పరిష్కరించుకుంటూ ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఎస్ఈసీ దృష్టిపెట్టారు. ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, నామినేషన్లు దాఖలైన చోట, ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కొందరు మృతి చెందగా ఆయా మండలాల్లో ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం ఎన్నికల నిర్వహణపై ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణపై గురువారం సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలుతో నీలం సాహ్నీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

    ఇది చదవండి: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్.., నా టార్గెట్ అదేనన్న ముఖ్యమంత్రి


    అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారు. గుంటూరులో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సందర్భంగా మాట్లాడిన ఆయన.. పరిషత్ ఎన్నికలు గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ కు అడ్డంకిగా మారాయని అన్నారు. కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే ఉండటంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలి. కొత్త ఎస్ఈసీ బాధ్యతలు స్వీకరించడంతో త్వరితగతిన ఈ ఆరురోజుల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారన్ననమ్మకముందని సీఎం అన్నారు.

    ఇది చదవండి: ఎమ్మెల్యే రోజాకు బాలకృష్ణ ఫోన్..ఎందుకో తెలుసా..


    అటు ఎస్ఈసీ, ఇటు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఆసక్తిగా ఉండటంతో ఏక్షణాన్నైనా ప్రకటన వచ్చే అకాశముంది. రాష్ట్రంలో వచ్చేవారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయనున్న నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఇచ్చి.. ఏప్రిల్ రెండోవారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంతో ఈ ఎన్నికలకు వైరస్ అడ్డుకాబోదని... కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తోంది. గత నెలలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరినా.. కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా నిర్వహించలమేని అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published:

    Tags: AP CS Neelam Sawhney, Ap local body elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు