• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VIJAYASHANTI UNHAPPY WITH TPCC ADVERTISEMENT REGARDING SONIA GANDHI MEETING

ఆ ప్రకటనలో మహిళలెక్కడ?... టీ పీసీసీపై విజయశాంతి అసంతృప్తి

ఆ ప్రకటనలో మహిళలెక్కడ?... టీ పీసీసీపై విజయశాంతి అసంతృప్తి

విజయశాంతి(ఫైల్ ఫోటో)

తెలంగాణలో సోనియాగాంధీ సభకు సంబంధించి మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లో ఒక్క మహిళ ఫోటో కూడా లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా ? అంటూ సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి టీ పీసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో సోనియాగాంధీ సభకు సంబంధించి మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లో ఒక్క మహిళ ఫోటో కూడా లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. టీఆర్ఎస్‌తో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్న విజయశాంతి... మరి సోనియాగాంధీ సభ ప్రకటనలో ఒక్క మహిళ ఫోటో కూడా లేకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా ? అంటూ సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సభలో మహిళలు కూడా పాల్గొంటారని వ్యాఖ్యానించారు.

    ఇదే అంశంపై తన అసంతృప్తిని టీ పీసీసీ పెద్దల దగ్గర విజయశాంతి వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనేకమంది మహిళా నేతలు ఉన్నారని... ఇందులో వారి ఫోటోలు పెట్టకపోవడం ఏంటని ఆమె వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. టీ పీసీసీ అధికారికంగా ఇచ్చిన ఈ ప్రకటనలో మహిళలెవరి ఫోటోలు లేవు. విజయశాంతి వ్యాఖ్యలపై టీ పీసీసీ ముఖ్యనేతలు ఇంకా స్పందించలేదని సమచారం.

    విజయశాంతి ఆగ్రహానికి కారణమైన ప్రకటన ఇదే..


    తెలంగాణ కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపికైన విజయశాంతి.... కాంగ్రెస్ తరపున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా... తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తానని వివరణ ఇచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు