కేటీఆర్.. ఎన్నికల్లో అందుకే ఆ డైలాగ్ వాడాడు : విజయశాంతి

కేసీఆర్ నియంత్రుత్వ ధోరణిపై మఠాధిపతులు,పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తున్నారని ఆశిస్తున్నట్టు విజయశాంతి చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: September 6, 2019, 5:42 PM IST
కేటీఆర్.. ఎన్నికల్లో అందుకే ఆ డైలాగ్ వాడాడు : విజయశాంతి
విజయశాంతి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 6, 2019, 5:42 PM IST
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో.. ఆలయ అష్టభుజి ప్రాకారాలపై సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నం,ప్రభుత్వ పథకాల చిహ్నాలు చెక్కించడంపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత విజయశాంతి దీనిపై స్పందించారు.ఎన్నికల సందర్భంగా కేటీఆర్ 'సారు..కారు..సర్కార్..' అన్న డైలాగ్ ఎందుకంతలా వాడారో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అన్నారు. అందుకే ఆలయ ప్రాకారాలపై తన బొమ్మను చెక్కించుకున్నారని మండిపడ్డారు.

రాజ్యాలు,రాజులు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్ ఇలా చేయడం దొరతనాన్ని ప్రదర్శించడమేనని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దం అని అన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ప్రజలు పవిత్రంగా భావిస్తారని.. అలాంటి ఆలయాన్ని రాకీయ ప్రచారానికి వాడుకోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంత్రుత్వ ధోరణిపై మఠాధిపతులు,పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తున్నారని ఆశిస్తున్నట్టు విజయశాంతి చెప్పుకొచ్చారు.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...