news18-telugu
Updated: November 8, 2020, 2:40 PM IST
విజయశాంతి (ఫైల్ ఫోటో)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని ఆమె అన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా ఆమె కామెంట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ మరికొంత ముందుగానే రాష్ట్రానికి వచ్చి ఉంటే పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చని అన్నారు. ఇప్పుడిక పరిస్థితులను కాలమే నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు.
"ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి... ఇంకొందరిని భయపెట్టి... ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం ఠాకూర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి" అని విజయశాంతి పేర్కొన్నారు.
ఇక, గతకొంతకాలంగా విజయశాంతి పార్టీ వీడతారనేది ప్రచారం కొంతకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. విజయశాంతితో ఇటీవల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి చర్చించినా పెద్దగా ఫలితం లేకుండా పోయిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ రంగంలోకి దిగారు. విజయశాంతిని కలిసేందుకు నేరుగా ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆమెతో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి.. ఠాగూర్‌కు స్పష్టంగా వివరించారు. రాహుల్ గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఠాగూర్‌కు విజయశాంతి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 8, 2020, 2:38 PM IST