• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VIJAYASHANTI SAYS ITS HER CHOICE NOT TO CONTEST IN TELANGANA ELECTIONS

టికెట్ నిరాకరించలేదు..నేనే వద్దన్నా: విజయశాంతి

టికెట్ నిరాకరించలేదు..నేనే వద్దన్నా: విజయశాంతి

విజయశాంతి ఫైల్ ఫోటో..

ప్రచార బాధ్యతలతో తీరికలేకుండా ఉండటం వల్లే పోటీ చేయాలనే ఆలోచనను తాను విరమించుకున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలిపారు.

  • Share this:
    కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోమావరం ప్రకటించిన 65 మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తనకు సీటు నిరాకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను పోటీ చేయమని కోరిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే ప్రచార బాధ్యతలతో తీరికలేకుండా ఉండటం వల్లే పోటీ చేయాలనే ఆలోచనను తాను విరమించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయశాంతి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Janardhan V
    First published:

    అగ్ర కథనాలు