• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VIJAYASHANTI FIRES ON CM KCR SAYS CONSPIRACY BEHIND HIS DECISIONS AK

Vijayashanti: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు.. విజయశాంతి అనుమానం

Vijayashanti: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు.. విజయశాంతి అనుమానం

సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

Vijayashanti: గడచిన టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవని విజయశాంతి విమర్శించారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గడం... ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటే అని విజయశాంతి వ్యాఖ్యానించారు. గడచిన టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవని విజయశాంతి విమర్శించారు.

    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే... సీఎం కేసీఆర్ ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచిస్తారని అన్నారు. అంతేకాకుండా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్‌‌మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చని పేర్కొన్నారు. అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన అవసరం ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోందని విజయశాంతి అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు