100 సీట్లు కాదు...కేసీఆర్‌కు 104 ఫీవర్ ఖాయం: విజయశాంతి

100 సీట్లు కాదు...కేసీఆర్‌కు 104 ఫీవర్ ఖాయం: విజయశాంతి

కాంగ్రెస్ నేతలతో విజయశాంతి (ఫైల్ ఫోటో)

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వంద సీట్లు రావన్న విజయశాంతి... ఫలితాల తరువాత కేసీఆర్‌కు 104 జ్వరం వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలు కాంగ్రెస్ స్థానాలు అడగొద్దని సూచించారు.

 • Share this:
  తెలంగాణలో తమ పార్టీ కచ్చితంగా వంద సీట్లు గెలుస్తుందని పదే పదే చెబుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఇటీవల జరిగిన పార్టీ అభ్యర్థుల సమావేశంలోనూ ఇదే రకమైన ధీమాను వ్యక్తం చేశారు. అయితే ఆయన వంద సీట్ల వ్యాఖ్యలపై విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్పందించారు. కేసీఆర్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వంద సీట్లు రావడం కాదు... ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్‌కు 104 జ్వరం వస్తుందని కామెంట్ చేశారు. ఈ మేరకు విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు.

  ఇక మహాకూటమి పొత్తులపై కూడా విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఇతర పార్టీలు గెలిచే స్థానాలు మాత్రమే అడగాలని ఆమె సూచించారు. అంతే తప్ప కాంగ్రెస్ గెలిచే స్థానాలను అడగవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటున్న సభల్లో పాల్గొంటున్న విజయశాంతి... టీఆర్ఎస్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు. మొదట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం సరికాదని వ్యాఖ్యానించిన విజయశాంతి... ఆ తరువాత ఈ విషయంలో మెత్తబడ్డారు. పొత్తులపై తుది నిర్ణయం అధిష్టానానిదే అని స్పష్టం చేశారు. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన విజయశాంతి... కాంగ్రెస్ తరపున మెదక్ ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు