టీఆర్ఎస్ హయాంలో అంతా అయోమయమన్న విజయశాంతి

కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల నుంచి వినిపించే బాధలు జోక్‌గా అనిపిస్తాయని విజయశాంతి విమర్శించారు. ప్రతిపక్షాలు చేసే నిరసనలు అంతకంటే జోక్‌గా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: July 20, 2019, 6:00 PM IST
టీఆర్ఎస్ హయాంలో అంతా అయోమయమన్న విజయశాంతి
విజయశాంతి(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి... మరోసారి కేసీఆర్ టార్గెట్‌గా కామెంట్స్ చేశారు. కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణలో కొత్తగా ప్రవేశ పెట్టబోయే మున్సిపల్ చట్టం ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్నారని... అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిలో ఏది అక్రమమో... సక్రమమో చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొందని విజయశాంతి విమర్శించారు. మరోవైపు మూడేళ్ల తర్వాత తెలంగాణలో కూడా అద్భుతం జరగబోతోందని బీజేపీ నేతలు అంటున్నారని... ఎవరి మాట నిజమవుతుందో కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.

ఇంతకాలం దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తామని చెప్పిన కేసీఆర్... ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని ప్రకటించడాన్ని బట్టి ఇంతకాలం అసలు తెలంగాణాలో పాలన జరగలేదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. మూడేళ్లలో అద్భుతం జరగబోతోందని కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఏ రకంగా మంటగలుస్తోందో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నాను కాబట్టి ఏమి చేసినా చెల్లుతుందని కెసిఆర్ భావించడం దురదృష్టకరమని అన్నారు.కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల నుంచి వినిపించే బాధలు జోక్‌గా అనిపిస్తాయని విజయశాంతి అన్నారు. ప్రతిపక్షాలు చేసే నిరసనలు అంతకంటే జోక్‌గా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. చివరకు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కూడా జోకులా అనిపించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అక్రమ కట్టడాలను కూలుస్తామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం... ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ హెరిటేజ్ భవనం అని తెలిసినా... దానిని కూలుస్తామనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ దృష్టిలో ఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనా ? అని నిలదీశార
First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...